జాతీయ వార్తలు

మళ్లీ హింసను రగిలించడానికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 18: జమ్ము కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికే తాజాగా సైనిక దళాలపై ఉగ్రవాద దాడి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన మెహబూబా మళ్లీ హింసాకాండను రగిలించడమే ఈ విఘాతక చర్య ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య మైత్రీబంధం క్షీణిస్తున్న నేపథ్యంలో దాన్ని ఆసరా చేసుకుని రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టించడమే ఈ దాడి లక్ష్యమన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని విధాలుగా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు తాజా పరిస్థితి మరింత అశనిపాతంగా మారిందని వెల్లడించారు. భారత్, పాక్‌ల మధ్య జరుగుతోన్న సంఘర్షణలకు మొదటినుంచీ కాశ్మీర్ బలైపోతూ వచ్చిందని, గత ఆరు దశాబ్దాలుగా ఇందుకు తాము భారీ మూల్యానే్న చెల్లించామని తెలిపారు. అయితే హింసాకాండవల్ల తమ లక్ష్యాలు ఎంతమాత్రం నెరవేరవన్న వాస్తవాన్ని ఉగ్రవాదులు గుర్తించాలన్నారు.