జాతీయ వార్తలు

ఆలయ ప్రవేశం మహిళల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 1: సంప్రదాయాలను అడ్డుపెట్టుకుని ఆలయ ప్రవేశాలపై మహిళలను ఇక ఎంతమాత్రం నిరోధించడానికి వీలు లేదని ముంబయి హైకోర్టు విస్పష్టంగా తెలియజేసింది. తమ ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు ఆలయాల్లోకి ప్రవేశించడమన్నది మహిళల ప్రాథమిక హక్కు అనీ, వారికి రక్షణ కల్పించడమే ప్రభుత్వాల బాధ్యత అని హైకోర్టు ఉద్ఘాటించింది. ఆలయ ప్రవేశాలపై శతాబ్దాలుగా సాగిన వివక్షకు కోర్టు ఉత్తర్వులు తెరదించాయి. అలాగే తమ హక్కులను సాధించుకునేందుకు మహిళలు చేసిన ఉద్యమం కూడా ఇందుకు దోహదం చేసింది. మహిళలకుండే ఈ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సీనియర్ అడ్వకేట్ నీలిమా వార్టక్, సామాజిక కార్యకర్త విద్యాబాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్.వాఘేలా, న్యాయమూర్తి ఎన్.ఎస్.సోనక్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను జారీచేసింది. శనిసింగాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాలుచేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 1956 నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థల (ప్రవేశ హక్కు)చట్టంలోని నిబంధనలను అమలుచేయాలని పిటిషనర్లు కోరారు. కాగా, కోర్టు ఆదేశాన్ని అమలుచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించకుండా ఎవర్ని అడ్డుకున్నా కూడా అలాంటివారిపై ఆరు నెలల జైలుశిక్షతోపాటు ఇతర చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కాగా, కోర్టు ఉత్తర్వును సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ఆహ్వానించారు. ఆలయ ప్రవేశాలపై లింగ సమానత్వం కోసం ఉద్యమిస్తున్న ఆమె, శనివారం తన అనుచరులతో కలిసి శనిసింగాపూర్ ఆలయానికి వెళుతున్నట్లు ప్రకటించారు.