జాతీయ వార్తలు

15న జమ్మూ కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాల రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపాంతరం చెందిన జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద ఆగస్టు 15న త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగుర వేసే కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నారా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంతోపాటు ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన నేపథ్యంలో లాల్‌చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని బీజేపీ నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం ద్వారా కాశ్మీర్ ప్రజలను జాతీ జన జీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని నరేంద్ర మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవంనాడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలన్నది బీజేపీ ప్రగాడ వాంఛ. 1992లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి, జూనియర్ నాయకుడుగా ఉన్న నరేంద్ర మోదీ, మరి కొందరు బీజేపీ నాయకులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి లాల్‌చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం తెలిసిందే. లాల్‌చౌక్ వద్ద వేడుకలకు మురళీ మనోహర్ జోషిని తీసుకెళ్లే ప్రతిపాదన కూడా బీజేపీ అధినాయకుల పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పంచాయతీలు, సర్పంచులకు దాదాపు యాభైవేల త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. 15 ఆగస్టు సందర్భంగా అన్ని పంచాయతీలపై త్రివర్ణ పతాకాల్ని ఎగుర వేసేందుకు వీటిని పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే జమ్మూకాశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు 150 మంది అఫ్గాన్ ఉగ్రవాదులను పంపించేందుకు సరిహద్దుల్లో సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి పంపించి విధ్వంసం సృష్టించటం ద్వారా అశాంతిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూకాశ్మీర్‌లో ఆశించినంత గొడవ జరగలేదని పాకిస్తాన్ పాలకులు భావిస్తున్నారు. ఈ కారణం చేతనే అఫ్గానిస్తాన్‌లో శిక్షణ పొందిన ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపించటం ద్వారా విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారు.
చిత్రం... 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో అద్భుత రీతిలో త్రివర్ణ పతాకంగా ఆవిష్కృతమైన బాలలు