జాతీయ వార్తలు

బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 19: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సోమవారం మృతి చెందారు. మిశ్రా సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. 82 ఏళ్ల పాతతరం నాయకుడైన మిశ్రాకు క్యాన్సర్ వ్యాధి రావడంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. కాగా సోమవారం ఉదయం మిశ్రా తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి చెందారు. మిశ్రా మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. మిశ్రా మృతి బిహార్‌కే కాదు మొత్తం దేశానికే నష్టమని ముఖ్యమంత్రి అన్నారు. మిశ్రా గొప్ప రాజకీయ నాయకుడని, విద్యావంతుడని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహన్ కూడా మిశ్రా మృతి పట్ల సంతాపం తెలిపారు. మిశ్రా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. మూడు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అందించిన సేవలు ఎప్పటికీ ప్రజలకు గుర్తు ఉంటాయని ఆమె తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆమె ప్రశంసించారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

చిత్రం... బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా