జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి నేటినుంచి కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 26న జరిపే పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభం కానుంది. ప్రయోగం పై శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్. సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది.
అంతకు ముందు ఉదయం రెండోసారి రాకెట్ రిహార్సల్స్‌ను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ ప్రయోగాత్మక ప్రయోగంలో రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ నుండి నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి మళ్లీ వెనక్కి పంపే ప్రక్రియను విజయవంతంగా చేశారు.
ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్-1 ఉపగ్రహం, కెనడా, అల్జీరియా, అమెరికాకు చెందిన 5 ఉపగ్రహాలు, బెంగళూరు, ముంబయి విద్యార్థులు రూపొందించిన మరో రెండు చిన్న ఉపగ్రహాలతో కలిపి మొత్తం 8 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా ఒకేసారి రోదసిలోకి పంపనున్నారు. ఈ నెల 26న ఉదయం 9:12గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లో నాలుగు, రెండు దశలలో ఇంధనాన్ని నింపి అన్ని దశల పనితీరును పరిశీలించినానంతరం ప్రయోగానికి 8గంటల ముందు రాకెట్‌కు విద్యుత్తు సరఫరా ఇచ్చి సిద్ధం చేస్తారు.

చిత్రం.. వేదికపై సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్