జాతీయ వార్తలు

దళితుల ఉద్యమంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సహా 96 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడంతో పాటు అల్లర్లకు పాల్పడ్డారనే అభియోగంపై వీరిని అరెస్టు చేసినట్టు అధికారులు గురువారం తెలిపారు.
ఆజాద్‌ను కోర్టులో హాజరుపరుస్తామని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఢిల్లీలోని రవిదాస్ మందిర్ కూల్చివేతకు నిరసనగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది దళితులు బుధవారం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయు గోళాలను ప్రదర్శించారు. ఈ పరిణామాలు చోటు చేసుకున్న తరువాత బుధవారం రాత్రి తుఘ్లకాబాద్ ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్, మరో 95 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అల్లర్లకు పాల్పడటం, చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడం, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడానికి గాయపరచడం, ప్రభుత్వానికి చెందిన, ఇతరుల ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అభియోగాలను మోపుతూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ‘చంద్రశేఖర్‌ను, మరో 95 మందిని అరెస్టు చేశాం’ అని సదరన్ రేంజ్ జాయింట్ పోలీసు కమిషనర్ దేవేశ్ శ్రీవాస్తవ తెలిపారు.
దళితులను అవమానించారు
రవిదాస్ మందిర్ కూల్చివేతను నిరసిస్తూ ప్రదర్శన చేస్తున్న దళితులపై పోలీసులతో లాఠీచార్జి చేయించిందని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దుయ్యబట్టారు. దళితుల గొంతును సహించకపోవడం అవమానమని ఆమె పేర్కొన్నారు.
బీఎస్‌పీ దూరం
లక్నో: ఇదిలా ఉండగా ఢిల్లీలో దళితుల హింసాత్మక నిరసనకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) గురువారం దూరం పాటించింది. తాము చట్ట పరిధిలోనే పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొంది. ‘ ఢిల్లీలో ప్రత్యేకించి తుఘ్లకాబాద్ ప్రాంతంలో విధ్వంసక ఘటనలు జరగడం సరికాదు. బీఎస్‌పీ ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. బీఎస్‌పీ ఎల్లవేళలా రాజ్యాంగాన్న, చట్టాన్ని గౌరవిస్తుంది’ అని బీఎస్‌పీ అధినేత్రి, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గురువారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.