జాతీయ వార్తలు

మాతృదేశంపై మమకారం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఏప్రిల్ 1: విద్యార్థుల్లో మాతృభూమి పట్ల మమకారాన్ని, సమాజంపట్ల బాధ్యతను, సహనశీలతను పెంపొందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. ప్రతి విద్యార్థిలోనూ ఈ రకమైన ఉన్నతమైన భావనలను పాదుకొల్పడం ద్వారా వారి వ్యక్తిత్వాలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముందని తెలిపారు. స్వామి రామ హిమాలయ వర్శిటీ తొలి స్నాతకోత్సవంలో శుక్రవారం నాడు మాట్లాడిన రాష్టప్రతి ‘విద్యాపరమైన నాణ్యతపై దృష్టిపెట్టకుండా ఉన్నత విద్యాసంస్థలను విస్తరించుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. నాణ్యతాయుతమైన విద్యాబోధనపైనే దృష్టి పెట్టాలని, తద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంతోపాటు ఉన్నత భావనలను పాదుకొల్పాలని తెలిపారు.
ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా పరిశోధనా పరమైన జిజ్ఞాసను కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థ సామాజిక స్పృహ కలిగిన వృత్తి నైపుణ్యం కలిగిన వారిని పెంపొందించాలని రాష్టప్రతి తెలిపారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంపై దృష్టి పెట్టాలని, ఆవిధంగా తమ మనుగడను తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు హితోపదేశం చేశారు.