జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ.328కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.141 కోట్లు విడుదల చేసినట్లు తెలిసింది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఈ నిధులు కేటాయించటం గమనార్హం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.712.62 కోట్లు కేటాయించాలని తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కోరగా కేంద్రం ఇదివరకు మొదట రూ.56.3 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రూ.328.16 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు తమకు నాలుగు వందల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం కొంత కాలం క్రితం రూ.34.27 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు సంవత్సరాంతంలో రూ.140.84 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.