జాతీయ వార్తలు

మూడు ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ఆంధ్రప్రదేశ్‌లో 3 విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిం ది. తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్ర యం ఏర్పాటుకు ఏంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే నేతృత్వంలో గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 4 విమానాశ్రయాల నిర్మాణంపై కమిటీ చర్చించింది. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో తలపెట్టిన విమానాశ్రయాలకు కమిటీ అంగీకారం తెలిపింది. విశాఖ సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనుం ది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,200 కోట్లు కాగా ఏటా 63 లక్షల ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడాన్ని లక్ష్యంగా విమానయాన శాఖ నిర్దేశించింది. నెల్లూరులోని దగదర్తి, కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయ ప్రాజెక్టులు ఒక్కొక్కటి అంచనా వ్యయం రూ.88 కోట్లు కాగా ఇందులో దగదర్తి విమానాశ్రయాన్ని ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. కర్నూలు దగ్గర ఓర్వకల్లు విమానాశ్రయాన్ని రాష్ట్రప్రభుత్వం నిర్మించనుంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలానికి గ్రీన్‌ఫీల్డ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.