జాతీయ వార్తలు

నీరూ నెత్తురూ కలవవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ‘నీళ్లూ నెత్తురూ ఎన్నటికీ కలవవు. కలిసి ప్రవహించవు.’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్‌పై రక్తపాతానికి ఒడిగడుతున్న పాకిస్తాన్‌పై జలాయుధాన్ని ప్రయోగించేందుకు మోదీ యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందంపై సోమవారం మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలోని ఉరీ సెక్టార్‌లో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగదాడి చేసి 19మంది జవాన్లను బలితీసుకున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచాలంటే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోవాలనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. మన దేశంలో రక్తాన్ని ఏరులుగా పారిస్తున్న పాక్‌లోకి నీళ్లను ఎలా ప్రవహింపజేస్తామని మోదీ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఈ ఒప్పందాన్ని పున:సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సింధూ నదీజలాల ఒప్పందంలోని అంశాలను పరిశీలించేందుకు అంతర్ మంత్రిత్వ శాఖలతో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా ఈ టాస్క్ఫోర్స్ తనకు నివేదిక ఇవ్వాలని మోదీ ఆదేశించారు. మంత్రులతో కూడిన ఈ బృందం పాక్‌కు గట్టి గుణపాఠం నేర్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సిఫారసు చేస్తుంది. దీంతో పాటు 2007లో సస్పెండ్ చేసిన తుల్‌బుల్ నావిగేషన్ ఒప్పందంపై కూడా టాస్క్ఫోర్స్ అధ్యయనం చేస్తుంది.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌తో 1960 సెప్టెంబర్‌లో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆరు నదులైన బియాస్, రావి, సట్లెజ్, సింధు, చినాబ్, జీలం జలాలను రెండు దేశాలు పంచుకోవాలని ఈ ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం ప్రకారం మూడు నదులు బియాస్, రావి, సట్లెజ్ నదులు పంజాబ్ నుండి ప్రవహిస్తాయి. ఈ మూడు కూడా భారత్ నియంత్రణలో ఉన్నాయి. మరో మూడు పశ్చిమ నదులు సింధు, చినాబ్, జీలం జమ్ము కాశ్మీర్ నుంచి ప్రవహిస్తాయి. ఒప్పందం ప్రకారం ఈ మూడింటిని పాకిస్తాన్ నియంత్రిస్తుంది. ఈ ఒప్పందం అమలు విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గతవారమే అన్నారు. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న చినాబ్ నదిపై నిర్మిస్తున్న పకాల్ దుల్, సావల్‌కోట్, బర్సర్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసే అంశం కూడా సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అంతే కాదు పాక్ నియంత్రణలో ఉన్న సింధు, చినాబ్, జీలం నదులపై జల విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నిలువ సామర్థ్యం పెంచుకోవటం ద్వారా పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సింధు జలాల ఒప్పందం రద్దు చేయాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
రద్దయితే పాక్‌కు నష్టమే
ఆరు నదుల జలాల పంపిణీకి సంబంధించిన సిందూ జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంటే పాకిస్తాన్‌కు పెద్ద నష్టమే జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
* ఒప్పందం రద్దయిన మరుక్షణం పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలను నీటి సమస్య ముచెత్తుతుంది.
* చినాబ్, జీలం, సింధూ నదీ జలాలను వాడుకునేందుకు పాకిస్తాన్‌కు ఈ ఒప్పందం వెసులుబాటును కల్పిస్తోంది. ఇది రద్దయితే పాక్‌కు జీవనాడి అయిన సింధూ లోయ తాగునీటి కొరత, కరవు, అనావృష్టికి గురికావల్సి వస్తుంది.
* దేశంలో 90శాతం వ్యవసాయం సింధూలోయలోనే సాగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వెనె్నముక. ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మరుక్షణం లోయలో నీటి సమస్యలు తీవ్రతరం అవుతాయి.
* పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తిలో 19శాతం సింధూలోయ నుంచే వస్తుంది. దేశ కార్మిక శక్తి యావత్తూ ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. ఒప్పందం రద్దయితే తీవ్రస్థాయిలో నిరుద్యోగ సమస్య ఉత్పన్నమవుతుంది.
* సింధూ నదీ జలాలను పాకిస్తాన్ తాగు, సాగు అవసరాలకోసమే కాకుండా జల విద్యుదుత్పత్తికి అధికంగా వినియోగిస్తుంది. ఒప్పందం రద్దయితే దీనిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
* పాక్ వ్యవసాయ రంగం పరిశ్రమలకు ముడిసరుకులు అందిస్తుంది. ఒప్పందం రద్దయితే పారిశ్రామిక రంగంపైనా ప్రభావం పడుతుంది.
* చివరగా సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు అయితే నవాజ్‌షరీఫ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.