జాతీయ వార్తలు

‘పాక్‌కు బాసట’ విషయం తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత్‌తో ఎప్పుడు పోరు జరిగినా తన చిరకాల మిత్రదేశం చైనా తనకు బాసటగా నిలుస్తుందన్న పాకిస్తాన్ విశ్వాసానికి ఇదో పెద్దదెబ్బ. ఇది పాకిస్తాన్ విశ్వాసమే కాదు.. ఆ దేశ నేతలు బహిరంగంగా చెప్పారు కూడా. అయితే పాకిస్తాన్‌కు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను చైనా ఖండించింది. పాకిస్తాన్ మీద ఏ దేశమైనా యుద్ధానికి దిగితే చైనా పాక్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని పాకిస్తాన్ మీడియాలో వచ్చిన విషయం తనకు తెలియదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి యు బోరెన్ సోమవారం పేర్కొన్నారు. ‘కాశ్మీర్ వివాదంపై మేము ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఉన్నాం. ఇకముందు కూడా ఉంటాం.. భారత్‌లోని నిరాయుధులయిన కాశ్మీర్ ప్రజలపై అత్యాచారాలు సమర్థనీయం కాదు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలి’ అని యు బోరెన్ తనతో అన్నారని పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్‌ను ఉటంకిస్తూ ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిందని పాకిస్తాన్ దినపత్రిక ‘డాన్’ ఇటీవల ప్రచురించింది. ఈ ప్రకటన గురించి ప్రస్తావించగా, ‘కాశ్మీర్ వివాదం చారిత్రకంగా వచ్చిందని మేము భావిస్తున్నాం. సంబంధిత పక్షాలు చర్చల ద్వారా శాంతియుతంగా ఈ వివాదాన్ని సరిగా పరిష్కరించుకుంటాయని మేము విశ్వసిస్తున్నాం’ అని యు బోరెన్ అన్నారు.