జాతీయ వార్తలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నూ సాధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, సెప్టెంబర్ 11: ‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌నూ సాధించండి సార్..’ అని మహారాష్టవ్రాది గోమాంతక్ పార్టీ (ఎంజిపి) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం పట్ల ఎంజిపి నాయకుడు సుదీన్ ధవలైకర్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న మహారాష్టవ్రాది గోమాంతక్ పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుతించింది. ఎన్డీఏ రెండో దఫా అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ-కాశ్మీర్ సమస్యపై ఎంతో సాహసంగా, కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సుదీన్ ధవలైకర్ అభినందించారు. ధవలైకర్ గతంలో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని గోవా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎంజీపి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. 370-అధికరణను రద్దు చేసిన ప్రధాని మోదీ ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై దృష్టి సారించాలని ధవలైకర్ కోరారు. 370-అధికరణను రద్దు చేయడం గొప్ప నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అనాదిగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న, బాధ పడుతున్న ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. చంద్రునిపై పరిశోధన చేయడానికి చంద్రయాన్-2 వ్యోమనౌకను పంపించిన ఇస్రో శాస్తవ్రేత్తలను ప్రోత్సహించిన తీరు కూడా అద్భుతం అంటూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన మోటారు వాహనాల చట్టాన్ని గోవా ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాఉండగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న గోవా అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో ఎంజిపికి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందగా, తాజాగా అంటే ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీతో జత కట్టారు. ఇక ధవలైకర్ ఒక్కరే ఆ పార్టీకి మిగిలారు.