జాతీయ వార్తలు

మంచి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ ముస్లిం సంస్థ మద్దతు ప్రకటించింది. కాశ్మీర్ భారత దేశంలోని అంతర్గత భాగమేనని జమాతే ఉల్మా-ఏ, హింద్(జేయూహెచ్)అనే సంస్థ స్పష్టం చేసింది. గురువారం ఇక్కడ జరిగిన జేయూహెచ్ వార్షిక సమావేశంలో ఓ తీర్మానం ఆమోదించారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను సమావేశం హర్షించింది. దేశ ఐక్యత కోరుతూ సంస్థ ప్రదర్శన నిర్వహించింది. ‘కాశ్మీర్ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్న విశ్వాసం మాకుంది. అయితే శత్రు సైనికులు, పొరుగుదేశం చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ ధ్వంసానికి పూనుకుంటోంది’అని సంస్థ ఆరోపించింది. ఆర్టికల్ 370ని ఎక్కడా ప్రస్తావించకుండా దాని వల్ల అనర్థాలే ఎక్కువ జరిగాయని సమావేశం విమర్శించింది. పొరుగుదేశం పాకిస్తాన్‌పైనే జమాతే తీవ్రమైన విమర్శలు చేశారు. కాశ్మీరీలను ఓ ‘కవచం’లా వాడుకున్నారని తీర్మానంలో మండిపడ్డారు. దేశ సమైఖ్యత, సమగ్రత కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి జమాతే సంపూర్ణ మద్దతును ఇస్తోందని ప్రకటించారు. వేర్పాటు వాద ఉద్యమాలు హింసను ప్రోత్సహించడమే కాదు, దేశ ప్రజలు ముఖ్యంగా కాశ్మీరీలకు తీవ్ర నష్టం చేస్తాయని జమాతే ఉల్మా పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి, సుస్థిరతకను కాశ్మీర్ కోరుకుంటోందని, దాని కోసం ప్రభుత్వం కృషి చేయాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. ‘కాశ్మీర్‌లో మానవ హక్కులను గౌరవించాలి. అక్కడి ప్రజల అవసరాలు తీర్చాలి. వారి ఆస్తులు కాపాడాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ బద్ధంగా అన్ని చర్యలూ తీసుకోవాలని, ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడి కాశ్మీరీల మనసులను దోచుకోవాలని జమాతే ఉల్మా పేర్కొంది.