జాతీయ వార్తలు

అధికరణం 370 రద్దుతో కాశ్మీర్ పంచాయతీలకు సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించడంతో ఇప్పుడు కింది స్థాయి ప్రజాస్వామిక సంస్థలు సాధికారతను సముపార్జించుకున్నాయని, అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసే నిధులు ఇప్పుడు నేరుగా పంచాయతీలకు చేరుతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం అన్నారు. పంచ్‌లు, సర్పంచ్‌లతో కూడిన ఒక ప్రతినిధి బృందం మంత్రిని కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికరణం 370 రద్దుతో పంచాయతీలకు స్వయంప్రతిపత్తి లభించిందని, ఫలితంగా అవి సాధికారితమయ్యాయని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం జమ్మూకాశ్మీర్‌లోని కింది స్థాయి నాయకుల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచిందని ఆయన అన్నారు. ఇప్పు డు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్తాయని, తద్వా రా అవి అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నికయిన నాయకులు ఉన్నారని, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై వారి అభిప్రాయం ఈ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమని సింగ్ అన్నారు. మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసిన సందర్భంగా జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో సర్పంచులు మాట్లాడుతూ తాము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నామని అన్నారు. స్వయంప్రతిపత్తి, ఆర్థిక అధికారాల పరంగా ఇప్పుడు మరింత సాధికారతను పొందినట్టు భావిస్తున్నామని వారు చెప్పారు. నేరుగా ఆర్థికాధికారాలు లభించడం వల్ల తాము జమ్మూకాశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే సాధికారతను పొందామని ప్రతినిధి బృందం తెలిపింది. ఆరోగ్యం, విద్య తదితర రంగాలలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని క్షేత్ర స్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రజాప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారని జితేంద్ర సింగ్ తెలిపారు. కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే ఈ నాయకులు మాత్రం క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు చెందిన వివిధ సామాజిక సమూహాలతో రెగ్యులర్‌గా చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు.