జాతీయ వార్తలు

మా జోలికి వస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 12: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) పేరుతో నిప్పుతో చెలగాట మాటవద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తమ రాష్ట్రంలో ఈ రకమైన ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. ‘దమ్ముంటే ఎన్‌ఆర్‌సీ పేరుతో రాష్ట్రంలోని ఏ ఒక్క పౌరుడినయినా ముట్టుకుని చూడండి’ అని బీజేపీ నాయకత్వానికి సవాల్ విసిరారు. ఎన్‌ఆర్‌సీని తాము అనుమతించేది లేదని ఉద్ఘాటించిన మమతా బెనర్జీ కులమతాల పేరుతో ప్రజలను చీల్చడాన్ని సహించబోమని అన్నారు. అలాగే అసోంలో అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని తాము అంగీకరించబోమని పేర్కొన్న మమతా ‘అధికార బలాన్ని ఉపయోగించి అసోం ప్రజల నోళ్లు మూయించారు. పశ్చిమ బెంగాల్‌లో ఆ ఆటలు సాగవు’ అని తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ర్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ ఈ ప్రక్రియను తీవ్ర పద జాలంతో దుయ్యబట్టారు. ఎన్‌ఆర్‌సీ వ్యవహారం అధికార తృణమూల్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణలు రేపుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ ర్యాలీ నిర్వహించారు. ‘అసోంల అమలు చేసిన ఎన్‌ఆర్‌సీలో 19లక్షల మందికి చోటు లభించలేదు. వీరిలో హిందూవులు, ముస్లింలు బౌద్ధ మతస్తులు కూడా ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయిన తర్వాత కూడా వీరి పౌరసత్వానికి సంబంధించి రుజువేమి కావాలి’ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బంగ్లాదేశ్ చొరబాటు దారులను తరిమేస్తామని బీజేపీ చెబుతోందని పేర్కొన్న మమత అదే జరిగితే తగిన విధంగా జవాబు ఇస్తామని హెచ్చరించారు. దశాబ్దాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సామరస్య పూర్వకంగా నివసిస్తున్నారని, వారిలో చీలికలు తేవడాన్ని సహించేది లేదన్నారు.

చిత్రాలు.. .కోల్‌కతాలో గురువారం జరిగిన ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ర్యాలీకి సారథ్యం వహిస్తున్న
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివాదం