జాతీయ వార్తలు

వారణాసి జైల్లో ఖైదీల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఏప్రిల్ 2: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా జైలులో శనివారం ఖైదీలు బీభత్సం సృష్టించారు. సిబ్బందితో ఘర్షణకు దిగి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను తీవ్రంగా గాయర్చడంతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను నిర్బంధించారు. జైలులోని కొన్ని బ్యారక్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంటోనె్మంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌకాఘాట్ వద్ద వారణాసి జిల్లా జైలులో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం ఇద్దరు ఖైదీలను గార్డులు కొట్టారని ఆరోపిస్తూ సహచర ఖైదీలు అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగి, జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీని నిర్బంధించారని పోలీసులు తెలిపారు. ‘నాణ్యత లేని’ ఆహారాన్ని అందజేయడం సహా వివిధ విషయాల్లో ఆశిష్ తివారీ తమను వేధిస్తున్నాడంటూ ఆగ్రహంతో ఉన్న ఖైదీలు ఆయనను నిర్బంధించడంతో పాటు జైలులో కొన్ని బ్యారక్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని లోపలి నుంచి తాళాలు వేసేసుకున్నారని పోలీసులు వివరించారు. అంతకుముందు ఖైదీలు జైలు సిబ్బందితో ఘర్షణకు దిగి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్‌ని తీవ్రంగా గాయపర్చడంతో ఆయనను ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ఈ ఘర్షణలో పలువురు గార్డులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దీంతో ఖైదీల ఆధీనంలో ఉన్న బ్యారక్‌లను స్వాధీనం చేసుకునేందుకు జైలులోనూ, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. చర్చల తరువాత ఖైదీలు ఏడు గంటల అనంతరం ఆశిష్ తివారీని విడిచిపెట్టారు. ఖైదీల డిమాండ్ మేరకు అధికారులు తక్షణమే ఆ జైలు నుంచి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ను మార్చేశారు.

చిత్రం తీవ్రంగా గాయపడ్డ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్