జాతీయ వార్తలు

కాంగ్రెస్ తప్పులను సరిదిద్దుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోన్‌భాద్ర (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 13: కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే రాష్ట్రంలోని సోన్‌భాద్ర జిల్లా ఉంభ గ్రామంలో జూలై 17వ తేదీన 11 మంది గిరిజనుల హత్యకు కారణమని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఉంభ గ్రామ విషాదానికి బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీయే. పేద ప్రజల హక్కులను కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా హరించినందుకు ప్రియాంకా గాంధీ క్షమాపణ చెబుతారా? అని నేను అడుగుతున్నాను’ అని ఆదిత్యనాథ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ హయాంలో మెమోరియల్‌లు నిర్మించే సాకుతో రైతుల భూములను కబ్జా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఇలాంటి తప్పులను ఇప్పుడు మా ప్రభుత్వం సరిదిద్దుతోంది’ అని ఆయన అన్నారు. ఉంభ గ్రామంలో రూ. 340 కోట్ల విలువయిన 35 ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. 11 మంది కిరాతకంగా హత్యకు గురయిన జూలై 17వ తేదీని సోన్‌భాద్ర, మొత్తం దేశం గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. ‘మేము ఆ సమయంలో మొత్తం సంఘటనపై దర్యాప్తు జరపాలని, దోషులపై చర్య తీసుకోవాలని నిశ్చయించుకున్నాం. సంఘటనకు బాధ్యులయిన అధికారులపై మేము ఇప్పటికే చర్య తీసుకున్నాం’ అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ‘ఈ విషాదకర ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారందరికి మనఃపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’ అని ఆయన అన్నారు.