జాతీయ వార్తలు

‘దూరదర్శన్’కు 60 ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలు స్తూ వస్తున్న దూరదర్శన్ ఆవిర్భవించి ఆదివారానికి సరిగ్గా 60 ఏళ్లు పూర్తయింది. మహాభారత్, ఫాజీ, మాల్గుడి డేస్ వంటి విఖ్యాత సీరియళ్లతో దేశ ప్రజలను అలరించిన దూరదర్శన్ 60ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దూరదర్శన్‌లో మీకు నచ్చిన అంశాలేమిటి?’ అని సామాజిక మాధ్యమాల్లో అడిగిన ప్రశ్నకు విశేష స్పందన లభించిం ది. అనేక మంది దూరదర్శన్ లోగోనూ చూపు తూ ప్రసారానికి ముం దు వచ్చే మ్యూజిక్ తమకు ఎంతగానో అలరించేదని ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ పేర్కొన్నారు. దూరదర్శన్‌లో తన చిన్నతనంలో వచ్చే టీవీ సీరియళ్లు, ఇతర షోలను తమకు మంచి కాలక్షేపాన్ని అం దించేవని గుర్తు చేసుకొన్నారు.
‘దూరదర్శన్ పాతది మాత్రమే కాదు.. డిజిటల్ ప్రసారాలను ఇస్తూ రోజురోజుకూ నూత న ఒరవడులకు శ్రీకారం చుడుతూ ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ వచ్చిందని’ పేర్కొన్నారు. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియా సాహు మాట్లాడుతూ ‘్భరతదేశానికి దూరదర్శన్ ఓ డీఎన్‌ఏగా మారిందనీ.. 60 సంవత్సరాలు పూర్తిచేసుకొన్న దూరదర్శన్‌కు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. 1959లో దూరదర్శన్ తన ప్రయోగాలను ప్రారంభించింది.. ప్రసారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపు ను సంపాదించుకొందని సాహు ఓ వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. రామాయణ్, హం లోగ్, బునియాద్, సురభి వంటి సీరియళ్లతో ప్రజలను అలరించిన దూరదర్శన్.. జాతీ య, అంతర్జాతీయ అంశాలను హైటెక్ రీతి లో కవర్ చేస్తూ తన ప్రతిభను చాటుకొంటోంది. 1959 సెప్టెంబర్ 15వ తేదీ న ప్రయోగాత్మకంగా ప్రసారాలను ప్రారంభించిన దూరదర్శన్ క్రమంగా ఢిల్లీలోని ఇళ్లల్లోకి 1965లో ప్రవేశించింది. 1972 నాటికి దూరదర్శన్ సేవలను ముంబ యి, అమృత్‌సర్‌లకు విస్తరించగా 1975 నాటికి మరో ఏడు నగరాల్లో దూరదర్శన్ ప్రసారాలను విస్తరించిం ది.