జాతీయ వార్తలు

కొత్త ఒరవడిని సృష్టించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: నూతన సాంకేతిక ఒరవడికి ఇస్రో శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం పి ఎస్ ఎల్‌వి-సి 35 ప్రయోగ విజయం అనంరతం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో తొలిసారే ఇస్రో ఎంతో ఘనత సాధించదన్నారు. ఇదంతా శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలు కూడా మన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు క్యూకడతాయన్నారు. ప్రయోగం ఒకటే అయినా రెండు ప్రయోగాలతో సమానమని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక రాకెట్ ద్వారా గతంలో ఒకే కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపేవారమని ఈ రాకెట్ ద్వారా వినూత్నంగా వేరువేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపగలిగామన్నారు. దీనివల్ల ఖర్చు ఆదాతో పాటు మరిన్ని సేవలకు సంబంధించిన ఉపగ్రహాలను తక్కువ కాలంలోనే ప్రయోగించేందుకు వీలుంటుందన్నారు. శాస్తవ్రేత్తల పనితీరు వల్లే రోజురోజుకు విజయాలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా పిఎస్‌ఎల్‌వి వాహక నౌక పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకొంటున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే తరహా ప్రయోగాలే షార్ నుండి నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ప్రయోగం ఇస్రోకు పెద్ద సవాల్‌గా మారినా విజయం సాధించామన్నారు. వివిధ ఒప్పందాల మేరకే ఉపగ్రహాలు తయారు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 21దేశాలకు సంబంధించిన 79విదేశీ ఉపగ్రహాలు పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా పంపించి వరుస విజయాలు సాధించామని గుర్తు చేశారు. పిఎస్‌ఎల్‌వి-సి 35 ద్వారా స్కాట్‌శాట్-1 ఉపగ్రహంతో పాటు 5విదేశీ ఉపగ్రహాలు, రెండు విద్యా సంస్థ విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా పంపామన్నారు. అంతేకాకుండా ఈ ప్రయోగం 2:15గంటలు సమయం పట్టడం నాలుగో దశలో రెండుసార్లు ఇంజిన్‌ను ఆఫ్‌చేసి మండించి మరలా రీస్ట్రాట్ చేసి మిగిలిన ఏడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టామన్నారు.
ఈ తరహా ప్రయోగాలు ఇస్రోకు తొలి మెట్టులాంటిదన్నారు. వారం తరువాత రాడార్‌కు స్కాట్‌శాట్-1 సిగ్నల్ వస్తుందన్నారు. ఇంతకు ముందు సముద్రంలో తుఫాన్‌లు, గాలులు, సునామీలు వచ్చిన వారం రోజుల తరువాత మాత్రమే మనకు తెలిసేదన్నారు. ఈ ఉపగ్రహం ద్వారా పది రోజుల ముందే సముద్రం ఉపరితలంలో ఏర్పడే అన్నింటిని సులువుగా తెలుసుకోవచ్చునన్నారు. నవంబర్‌లో పిఎస్‌ఎల్‌వి-సి 36, డిసెంబర్‌లో జి ఎస్‌ఎల్‌వి- మార్క్ 3 ప్రయోగం ఉంటుదన్నారు. ఆదిత్య, చంద్రయాన్-2 ఉపగ్రహాలను పంపేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. అక్టోబర్ నాలుగున ఫ్రెంచి గయానాలోని కురు అంతరిక్ష కేంద్రం నుండి జీశాట్-18 ప్రయోగం ఉంటుందన్నారు. షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ నుండి ఈ సెప్టెంబర్ వరకు 8ప్రయోగాలు విజయవంతంగా చేపట్టామని ఈ ప్రయోగంలో 8 ఉపగ్రహాలు పంపడం విశేషమన్నారు.
ఉపగ్రహ డైరెక్టర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం 18నెలలోనే రూపకల్పన చేశామని ఓషన్‌శాట్-2 స్థానంలో దీనిని పంపినట్లు తెలిపారు. మనకే కాకుండా విదేశాలకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్తవ్రేత్తలు డాక్టగర్ కె.శివన్, తపన్ మిశ్రా, రాకేష్, వెహికల్ డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విజయ చిహ్నం చూపుతున్న ఇస్రో చైర్మన్