జాతీయ వార్తలు

మనది ఆధ్యాత్మిక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: మంగోలియా అధ్యక్షుడు ఖల్త్ మాగ్లిన్ బక్తుల్గాతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగోలియాలోని ఒక బౌద్ధారామంలో బుద్ధుడి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐదు రోజుల పర్యటనార్థం భారత్ వచ్చిన మంగోలియా అధ్యక్షుడితో కలసి లోక్ కళ్యాణ్‌మార్గ్‌లోని తన ఇంట్లోనే మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంగోలియా రాజధాని ఉలాన్ బత్తార్‌లో ఈ బౌద్ధారామం ఉంది. ఈ ఆవిష్కరణకు ముందు ఆ ఆరామంలోనే బౌద్ధ సన్యాసులు మంత్రోచ్ఛరణ చేశారు. అనంతరం ఢిల్లీలోని మోదీ ఇంట్లో ఓ బౌద్ధ సాధువు ప్రార్థనలు జరిపారు. ఆ సందర్భంగా మోదీ, మంగోలియా అధ్యక్షుడు చేతులు కట్టుకుని శిరస్సు వంచి నిల్చున్నారు. భారత్-మంగోలియా మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి, ఉమ్మడిగా పంచుకుంటున్న బౌద్ధమత వారసత్వానికి ఈ విగ్రహావిష్కరణ ప్రతీక అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో మంగోలియాలోని ఈ బౌద్ధారామాన్ని సందర్శించిన మోదీ ఓ బోధి వృక్ష మొక్కను బహూకరించారు. ఆ సందర్భంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధానికి దానిని సంకేతంగా పేర్కొన్నారు. అలాగే, ఆ బౌద్ధారామానికి బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.