జాతీయ వార్తలు

నా పేరు జపించడం కాదు.. ఆర్థిక, రైతుల గురించి మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 11: ‘నా పేరు జపించడం కాదు, ముందుగా ఆర్థిక పరిస్థితులు, రైతుల సమస్యల గురించి మాట్లాడండి’ అని ఎన్‌సీపి అధ్యక్షుడు శరద్ పవార్ బీజేపీ అగ్రనేతలకు చురకలంటించారు. మహారాష్ట్ర ఎన్నికల రణ భేరిలో బీజేపీ-ఎన్‌సీపి నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎన్నికల ప్రచారంలో తన పేరు ప్రస్తావించకుండా, తన జపం చేయకుండా మాట్లాడలేకపోతున్నారని పవార్ శుక్రవారం నాడిక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఆర్థిక దుస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం గురించి మాట్లాడకుండా ఎంత సేపూ తన జపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఎన్‌సీపి స్వాగతిస్తున్నదన్నా రు. అదేవిధంగా 371-అధికరణను కూడా రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాలాకోట్ వైమానిక దాడుల్లో భద్రతా దళాలు చూపించిన శౌర్యాన్ని అభినందిస్తున్నానని, అయితే ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రచారానికి వాడుకున్నారని పవార్ దుయ్యబట్టారు.
పోటీ చేయను..
మాహా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయదలచుకోలేదని శరద్ పవార్ తెలిపారు. ఈ విషయాన్ని తాను లోగడ ప్రకటించానని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 370-అధికరణ రద్దుకు అనుకూలమా? కాదా? అని అమిత్ షా తనను ప్రశ్నించడాన్ని పవార్ ఎద్దెవా చేశారు.