జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో అభివృద్ధికి బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 12: జమ్మూకాశ్మీర్ 370 ఆర్టికల్ అమల్లో ఉన్నప్పుడు ఉగ్రవాద కేంద్రంగా మారిందని, దానిని రద్దు చేసిన తర్వాత క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా కాశ్మీర్‌లో అభివృద్ధికి కేంద్రం బాటలు వేసిందని అన్నారు. మహారాష్టల్రోని దేవేంద్ర ఫడ్నవీస్ పాలన అద్భుతమని శనివారం విడుదల ఏచసిన ఒక ప్రకటనలో నఖ్వీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ భాగస్వామ్యంలోని ప్రభుత్వ విధానాల వల్ల మహారాష్ట్ర అన్ని రకాలుగానూ నష్టపోయిందని, ఇప్పుడు బీజేపీ సర్కారు తీసుకుంటున్న చర్యలతో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా మహారాష్ట్ర సాగుతున్నదని పేర్కొన్నారు. ఈనెల 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మరోసారి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశార. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మహారాష్ట్ర మరోసారి తిరోగమనంలోకి వెళుతుందని నఖ్వీ అన్నారు. ప్రజలకు అన్ని విధాలా మెరుగైన పాలనను అందిస్తున్న తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

*చిత్రం...కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ