జాతీయ వార్తలు

ఉద్యోగాలు అడిగితే.. చంద్రుడ్ని చూపిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాతూర్, అక్టోబర్ 13: కీలకాంశాలను విస్మరించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, అలాగే మీడియా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మహారాష్టల్రోని లాతూర్ జిల్లా ఔసాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన దేశ యువత ఉపాధి లేక నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం వారికి చంద్రుడ్ని చూపిస్తోందని అన్నారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2ను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడుతున్నా వీరికి ఏమాత్రం పట్టంలేదని అన్నారు. దేశంలో అనేక కంపెనీలు మూతపడడానికి విచ్ఛిన్నకర రాజకీయాలే ఓ కారణమని ఆయన తెలిపారు. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగంపైనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించిన రాహుల్ ‘చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపడం ద్వారా ఈ దేశ ప్రజలకు తిండిపెట్టలేరు. అలాగే ఇలాంటి ప్రయోగాలు నిరుద్యోగ యువత ఆకలి తీర్చలేవు’ అని అన్నారు. గత కొన్ని రోజులుగా మూన్ మిషన్‌ను మోదీ సర్కారు విజయాల్లో ఒకటిగా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని పేర్కొన్న రాహుల్ గాంధీ ‘నిరుద్యోగం గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైంది. రెండువేలకు పైగా పరిశ్రమలు దేశంలో మూతపడ్డాయి. ఆటోమొబైల్ రంగం కలావికలం అయింది’ అని అన్నారు. గుజరాత్‌లో వస్త్రాలు, వజ్రాల పరిశ్రమలు దారుణంగా ఉన్నాయని, మీడియా మాత్రం వీటి గురించి ఏమీ చెప్పడంలేదని ఆయన అన్నారు. మీడియా కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. రైతులను ప్రశ్నించినా, యువతను ప్రశ్నించినా వారి బాధలే కళ్లకు కడతాయని రాహుల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో సామాన్యులు క్యూలు కట్టారే తప్ప ధనికులెవరూ బ్యాంకులకే రాలేదని ఆయన అన్నారు. జీఎస్టీ వల్ల సర్వనాశనం అయిపోయామని, చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పన్ను విధానాల వల్ల వీరి ఆర్థిక పరిస్థితి శిథిలమైందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల విధానాల వల్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే గుజరాత్ నుంచి పశ్చిమబెంగాల్ వరకు అందరి పరిస్థితి ప్రతికూలమైపోయిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం అన్నివర్గాల ప్రజల కృషి వల్లే అభివృద్ధి చెందిందని, ఎంతగా ప్రజల్లో వైషమ్యాలు సృష్టిస్తే అంతగానూ ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన ప్రధాని మోదీ 2017 నాటి డోక్లామ్ ప్రతిస్పందనపై ఆయనను నిలదీయగలిగారా? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకువచ్చిన విషయాన్ని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో 15 మంది సంపన్నులకు సంబంధించి 5.5 లక్షల కోట్ల రుణాన్ని మోదీ సర్కారు మాఫీ చేసిందని ఆరోపించిన రాహుల్ గాంధీ ‘మీడియా, మోదీ, అమిత్ షా కీలకాంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నా వారి కడగళ్లను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లేదని, అలాగే ఉద్యోగాలు లేకపోయినా వాటి గురించి మాట్లాడడం లేదని రాహుల్ అన్నారు. అలాగే సంపన్నులు తీసుకున్న రుణాలను మోదీ సర్కారు మాఫీ చేసినా దానిపైనా మీడియా వౌనమే వహించిందని రాహుల్ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలు లక్ష్యం, పేదలను దోచుకుని సంపన్నులకు పంచిపెట్టడమేనని అన్నారు. 370 అధికరణ రద్దు, చంద్రయాన్ గురించే మాటలు వల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై నోరు మెదపడం లేదని రాహుల్ ధ్వజమెత్తారు.

*చిత్రం... ముంబయిలో ఆదివారం జరిగిన కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త ర్యాలీలో కరవాలం ఝళిపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ