జాతీయ వార్తలు

ఇంకా సాక్ష్యాలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 17: అయోధ్యలో వివాదాస్పదమైనదిగా పేర్కొంటు న్న భూమి ఖచ్చితంగా హిందువులదేనని, శ్రీరాముడు అక్కడే జన్మించాడని అనాదిగా యావత్ భారతం నమ్ముతున్నదని కర్నాటక టూరిజం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీటీ రవి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఇంకా సాక్ష్యాధారాలను సమర్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందన్నని అనుకుంటున్నానని గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. యావత్ దేశంతోపాటు తాను కూడా కోర్టు తీర్పు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రవి అన్నా రు. ‘వివాదాస్పదమైనదిగా చెప్తున్న భూమి రామజన్మ స్థానమేనని చెప్పారు. కొన్ని వేల ఏళ్ల నుంచి ఇదే అభిప్రాయం దేశ ప్రజల్లో ఉందని, దీనిని మించిన సాక్ష్యం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. తాను అయోధ్యకు 1989, 1992 సంవత్సరాల్లో వెళ్లానని రవి తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా? తాను ఎప్పుడు అక్కడి వెళతానా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని అన్నా రు. ఖాళీ ప్రాంతంలోనే బాబర్ మసీదు కట్టించాడని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని రవి స్పష్టం చేశా రు. ఇది రామజన్మ భూమే అనడానికి కోట్లాది మంది భారతీయుల నమ్మకమే ప్రధానమని వ్యాఖ్యానించారు. ఇలావుంటే, రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు విచారణను ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ వచ్చేనెల 17న రిటైర్ అవుతారు. బాబ్రీ మసీదు వివాదంపై ఏర్పాటైన ఐదుగురు సభ్యులుగల సుప్రీం కోర్టు ధర్మాసనానికి అధ్యక్షత వహిస్తున్నారు. కాబట్టి, రిటైర్మెంట్ నాడు ఆయన అయోధ్య కేసులో తీర్పును వెల్లడిస్తారని సమాచారం.