జాతీయ వార్తలు

విద్యాలయాల నుంచే పోరాటాలు, ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పోరాటాలు, ఉద్యమాలు విద్యాలయాల నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి బాలుడు మంచి పౌరుడిగా తీర్చిదిద్దే సంస్కార కేంద్రాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మహేశ్వరీ విద్యాలయం నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాలయాలు మంచి సమాజం నిర్మాణానికి ఉపయోగపడుతాయన్నారు. వ్యక్తి సంస్కారం, సంస్కృతి సంఘం పట్ల బాధ్యతల గురించి విద్యాలయాల్లో ఉపాధ్యాయులు నేర్పుతారన్నారు. ప్రాచీన భారతం నుంచి నేటి వరకు భారత్‌లో పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం కల్పించే సమాజం మనదన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు విద్యా ఫలాలు అందించాలన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ చిత్రపటంలో విశిష్ట స్థానం ఉందన్నారు. అన్ని రంగాల్లో హైదరాబాద్‌కు చెందిన వారు దూసుకెళుతున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, మన ప్రజలు విద్యాలయాలను దేవాలయాలుగా చూస్తారన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును విద్యాలయాలు, ఉపాధ్యాయుడు నిర్దేశిస్తారన్నారు. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతిలో విద్యారంగానికి ఉన్న విశిష్టతను వివరిస్తూ, తల్లిదండ్రులు, గురువులను గౌరవించే విధానం మన సమాజంలో ఆది నుంచి ఉందన్నారు. ప్రపంచానికి గురుకులాల గొప్పతనాన్ని చాటి చెప్పిన తొలి దేశం భారత్ అని చెప్పారు. హైదరాబాద్‌లో పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో మహేశ్వరీ విద్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
రుణమేళాను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో వెంటనే చెల్లించాలని కేంద్ర హోంశాఖసహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన అమీర్‌పేట కమ్మసంఘంలో బ్యాంకుల రుణమేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులు తీసుకున్న రుణాలను సొంత కాళ్ల మీద నిలబడేందుకు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలను పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు, మహిళల కోసం వివిధ రూపాల్లో కేంద్రం రుణాలు అందిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం, ఆర్థిక స్వావలంభన ప్రభుత్వానికి ముఖ్యమని ఆయన అన్నారు.
*చిత్రం...హైదరాబాద్ పాతబస్తీలోని కపుత్తర్‌ఖానాలో బుధవారం
మహేశ్వరి విద్యాలయ హైస్కూల్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా