జాతీయ వార్తలు

శ్రీనగర్ మార్కెట్లో గ్రనేడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 4: జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీ నగర్‌లో బాగా రద్దీగా ఉన్న మార్కెట్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, 35 మందికి గాయలయ్యాయని పోలీసులు తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లో లోపు మరోసారి గ్రనేడ్ దాడి జరగడంతో ప్రజలు భయకంపితులయ్యారు. సోమవారం విసిరిన గ్రనేడ్ లో 35 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన మిగతా వారికి చికి త్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడిలో సాహరాన్‌పూర్‌కు చెందిన రింకుసింగ్ (40) మృతి చెందారని వారు తెలిపారు. హరి సింగ్ హై స్ట్రీట్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు గ్రనేడ్ దాడి జరిగిందన్నారు. ఆ సమయంలో మార్కెట్ రద్దీగా ఉందన్నారు. జమ్మూ-కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో ప్రశాం త వాతావరణం నెలకొంటున్న సమయంలో ఈ గ్రనేడ్ దాడి జరగడంతో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రైవేటు రవాణా వ్యవస్థ దాదాపు స్తం భించింది. గ్రైనెడ్ దాడి వార్తతో చిరు వ్యాపారులు, వాణిజ్య, వాపారులు తమ దుకాణాలను మూసి వేశారు. విద్యా సంస్థలకు వెళ్ళిన తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకుని వెళ్ళారు.
గత నెల 12న కూడా ఉగ్రవాదులు గ్రైనెడ్ విసిరిన దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
*చిత్రాలు.. శ్రీనగర్‌లో సోమవారం ఓ మార్కెట్‌లో జరిగిన గ్రనేడ్ దాడిలో గాయపడ్డ ఓ పౌరుడు చికిత్స పొందుతున్న దృశ్యం
.* ఇదే దాడిలో బంధువును కోల్పోయిన ఓ మహిళ విషాదం (ఇన్‌సెట్‌లో)