జాతీయ వార్తలు

పోలీసుల దాడిపై ప్రివిలేజ్ మోషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై ఖాకీల దాష్టికం ఢిల్లీకి తాకింది. ఆర్టీసీ డ్రైవర్ ఎన్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ఎంపీ సంజయ్ కాలర్ పట్టి చేయిచేసుకోవడంపై ప్రివిలేజ్ మోషన్‌కు రంగం సిద్ధమైంది. ఆయన గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. పోలీసుల దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్పీకర్‌కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గుండెపోటుతో మరణించిన బాబు అంతిమయాత్రలో ఖాకీల దౌర్జన్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. కార్యకర్తలపైన జరిగిన దాడి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫోటోలు, వీడీయోలు, పత్రిక కథనాలను పరిశీలించి ఘటన వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఖాకీల తీరుపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని ఎంపీ కోరగా ఫిర్యాదుపై స్పీకర్
స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు. విచారణ తరువాత నివేదిక అందించాలని కోరారు. కరీంనగర్ ఖాకీలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌తో పాటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామరసు బాలసుబ్రమణ్యం స్పీకర్‌ను కలిశారు. జాతీయ మానవహక్కుల కమీషన్‌కు కూడా ఎంపీ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన విషయాన్ని స్పీకర్‌కు ఎంపీ బండి సంజయ్ వివరించారు. పోలీస్ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసిందని, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్‌ను, పోలీస్ అధికారులను దాడి ఘటనలో ప్రతివాదులుగా పేర్కొంది. ఇలావుంటే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పరిశ్రమను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడను బండి సంజయ్ కోరారు. తమ నియోజగ వర్గం అభివృద్ధికి సంబంధించిన తీసుకుంటున్న చర్యలను వివరించారు. టీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయడం లేదని ఆయన కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.

*చిత్రం...లోక్‌సభ స్పీకర్‌కు ఖాకీలపై ఫిర్యాదు చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్