జాతీయ వార్తలు

అదో తుగ్లక్ తప్పిదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: మూడేళ్ల క్రితం పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా మోదీ సర్కారు చేసిన తుగ్లక్ తప్పిదాన్ని దేశం మరచిపోదని, ఎన్నడూ క్షమించదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. పెద్దనోట్ల రద్దుతో లక్షలాది మంది ఉపాధి హరించుకుపోయిందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ తుగ్లక్ నిర్ణయంపై మోదీ సర్కారు నిర్వాకాన్ని తమ పార్టీ దేశవ్యాప్తంగా ఎండగడుతుందని అన్నారు. 120 మంది చనిపోయినా, మధ్య, చిన్నశ్రేణి వ్యాపారాలు దెబ్బతిన్నా, ఇటు ప్రధాని మోదీ గానీ ఆయన సహచరులు గానీ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదని తెలిపారు. ఎంతగా ఈ తప్పుడు నిర్ణయ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించినా దేశం, దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని సోనియా అన్నారు. 2017 నుంచి కూడా పెద్దనోట్ల రద్దు గురించి ప్రధాని మోదీ, ఆయన సహచరులు మాట్లాడమే మానేశారని, తాము మాట్లాడకపోతే ప్రజలే మరచిపోతారన్న అపోహలో వారు ఉన్నారని సోనియా విరుచుకుపడ్డారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో పాలకులను ఒదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. తమ పార్టీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుందని పేర్కొన్న సోనియా ‘బీజేపీ మాత్రం దేశ ప్రజల జీవితాన్ని, వ్యాపారస్థుల జీవితాలను సమస్యలమయం చేసి నిమ్మకు నీరెత్తిన చందంగా ఉంది’ అని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తే నల్లధనాన్ని రూపుమాపవచ్చునని, నకిలీ కరెన్సీని కూడా పూర్తిగా నిర్మూలించవచ్చునని, అలాగే ఉగ్రవాదం, తీవ్రవాదం అంతమైపోతాయని మోదీ సర్కారు చెప్పుకొచ్చిన విషయాన్ని సోనియా గుర్తు చేశారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనాన్ని నిర్మూలించామని, అది వ్యవస్థలోకి మళ్లీ రాదంటూ సుప్రీంకోర్టు కూడా మోదీ సర్కారు నివేదించిందని అన్నారు. కానీ ఈ నిర్ణయాన్ని తీసుకుని మూడేళ్లు దాటినా మోదీ చెప్పిన ఏ లక్ష్యమూ నెరవేరలేదని, రద్దయిన కరెన్సీలో 99.3 శాతం వెనక్కి వచ్చేసిన విషయాన్ని రిజర్వు బ్యాంకే వెల్లడించిందని సోనియా తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారమే పెద్దనోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదం, నక్సలిజం మరింత తీవ్రమయ్యాయన్న విషయం స్పష్టమవుతుందని ఆమె అన్నారు.