జాతీయ వార్తలు

‘అమరావతి’పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. సోమవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతిలో చిత్తడి నేలలు, వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీ వేయాలని పిటిషనర్ శ్రీమన్నారాయణ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ అంశంపై పూర్తి అవగాహన లేనందున నిపుణుల కమిటీ సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే నిపుణుల సాయంతోనే వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించామని ఏపీ ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు గుర్తించడం పూర్తి చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది గంగూలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా గుర్తించడం వేరు, డిమార్కు చేయడం వేరని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
నూతన రాజధాని వరద ప్రాంతాలను గుర్తించిన ప్రతిని పిటిషనర్‌కు ఇవ్వాలని సూచించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అదేరోజు తుది వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.