జాతీయ వార్తలు

శివసేనకు మొండి‘చేయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: కాంగ్రెస్ అధినాయకత్వం శివసేనకు మొండిచేయి చూపించింది. మహారాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలా లేదా? అనే ఆంశంపై కాంగ్రెస్ అధినాయత్వం సోమవారం దినమంతా చర్చలు జరిపినా ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
మిత్రపక్షమైన ఎన్‌సీపీతో రేపు మరోసారి చర్చలు జరిపిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. శివసేన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు కాంగ్రెస్ సోమవారం రాత్రి 7.30లోగా ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉండింది. అయితే సమయం ఏడున్నర దాటుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేస్తూ ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో రేపు చర్చలు జరిపిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పటం ద్వారా అందరిని ఆశ్చర్యపరిచారు. దీనితో శివసేన నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మద్దతు ఇవ్వటం అనుమానంలో పడిపోయింది. శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ సోమవారం దినమతా కొనసాగింది. కాంగ్రెస్ చివరకు సానుకూల నిర్ణయం తీసుకోకపోటంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న శివసేన అధినాయకుడు ఉద్దావ్ థాక్రే కలలు కల్లలయ్యాయి. శివసేనకు మద్దతు ఇవ్వటం ద్వారా మహారాష్టల్రో మరోసారి అధికారం చెలాయిచాలన్న ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ‘పవర్ పాలిటిక్స్’కు కాంగ్రెస్ కళ్లెం వేసింది. శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్‌లో విభేదాలు నెలకొన్నాయి. శివసేనకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం వాదిస్తే మరో వర్గం మాత్రం శివసేనకు మద్దతు ఇవ్వటం ద్వారా బీజేపీని దెబ్బతీయాలని మరి కొందరు వాదించారు. దీనితో సోనియా గాంధీ శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్నారు. మహారాష్టల్రో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు సోమవారం సాయంత్రం ఏడున్నరలోగా తమ మద్దతును అధికారికంగా ప్రకటించవలసి ఉండింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిపిన అనంతరం సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపినా శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. శివసేన నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం, మహారాష్ట్ర కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వాడివేడి చర్చ జరిగింది. మహారాష్టల్రో బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపాలంటే శివసేనకు మద్దతు ఇవ్వాలని కొందరు సీనియర్ నాయకులు వాదించగా.. హిందుత్వ శివసేనకు మద్దతు ఇవ్వటం అంటే కాంగ్రెస్ ఆత్మను అమ్ముకున్నట్లేనని ఇతర సీనియర్ నాయకులు వాదించినట్లు తెలిసింది. ‘శత్రువు శత్రువు మన మిత్రుడు’ కాబట్టి శివసేనకు మద్దతు ఇవ్వటం ద్వారా బీజేపీని దెబ్బతీయాలని కొందరు సీనియర్ నాయకులు ప్రతిపాదించినప్పుడు సమావేశంలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగిందని అంటున్నారు. శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోలేకపోవటంతో సోనియా గాంధీ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. సోనియా గాంధీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర పీసీసీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌లోని మెజారిటీ మరాఠా శాసన సభ్యులందరు కూడా శివసేనకు మద్దతు ఇవ్వాలని సోనియా గాంధీతో వాదించారు. ఇతర వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు మాత్రం శివసేనకు మద్దతు ఇస్తే పార్టీ నాశనమైపోతుందని హెచ్చరించినట్లు చెబుతున్నారు. శివసేనకు బైటి నుండి మద్దతు ఇస్తే బాగుంటుందంటూ కొందరు సీనియర్ నాయకులు చేసిన ప్రతిపాదనను మరాఠా శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. శివసేనకు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో చీలిక వస్తుందని మరాఠా శాసనసభ్యులు కాంగ్రెస్ అధ్యక్షురాలిని హెచ్చరించారని అంటున్నారు. శివసేనకు బైటినుంచి మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన పట్ల సోనియా గాంధీ మొగ్గు చూపినా చివరకు మద్దతు ఇచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేకపోయారు.
శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై తామీ రోజు ఒక నిర్ణయానికి రాలేకపోయాం.. సోనియా గాంధీ ఈ రోజు శరద్ పవార్‌తో టెలిఫోన్ చర్చలు జరిపారు.. రేపు ఆయనతో మరోసారి చర్చలు జరిపిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే రాత్రి పొద్దుపోయిన తరువాత విలేఖరులతో చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
*చిత్రం...సోనియా గాంధీ