జాతీయ వార్తలు

సీన్‌లోకి ఎన్‌సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, నవంబర్ 11: మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతూ దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇప్పుడు ఊహించని రీతిలో ఎన్‌సీపీకి దక్కింది. తమకు మూడు రోజుల అదనపు గడువు ఇవ్వాలన్న శివసేన అభ్యర్థనను భగత్‌సింగ్ కోషియార్ తిరస్కరించారు. మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. తమకు మద్దతునిస్తున్న పార్టీల నుంచి లేఖలను గవర్నర్‌కు అందజేయడంలో శివసేన విఫలమైంది. దాంతో 54 మంది ఎమ్మెల్యేలతో మూడో అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్‌సీపీకి గవర్నర్ నుంచి ఆహ్వానం లభించింది. నిర్ణీత నియామవళి ప్రకారమే గవర్నర్ తమకు ఆహ్వానం పలికారని మంగళవారం రాత్రి 8.30 గంటలలోగా మళ్లీ కలుస్తామని ఆయనకు తెలియజేసినట్లు ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు. తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో మాట్లాడాల్సి ఉన్న విషయాన్ని గవర్నర్‌కు
తెలిపామని పాటిల్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి దాని మిత్రపక్షమైన శివసేనకు తలెత్తిన పదవుల వివాదం అంతిమంగా రాష్టప్రతి పాలన విధించక తప్పని పరిస్థితి దారి తీసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. తమంతట తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ నాయకత్వం గవర్నర్ భగత్‌సింగ్ కోషియార్‌కు చెప్పడంతో రెండో అతి పెద్ద పార్టీ అయిన శివసేనను ఆయన ఆహ్వానించారు. కాంగ్రెస్-ఎన్‌సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న శివసేనకు ఆటంకం ఎదురయ్యింది. గవర్నర్ విధించిన గడువులోగా ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి శివసేన ముందుకు రాకపోవడంతో మరో మూడు రోజుల గడువు కోరడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. తదుపరి గడువు ఇచ్చేది లేదని గవర్నర్ తేల్చి చెప్పారు. దాంతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్‌సీపీని గవర్నర్ ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కచ్చితమైన ప్రణాళికతో రావాలని మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు గడువు ఇచ్చారు. తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి సుస్థిర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ తెలిపారు. సోమవారం అంతా శివసేన నేతలు అటు కాంగ్రెస్, ఇటు ఎన్‌సీపీ నేతలతో చర్చలతోనే గడిపారు. ఈ రెండు పార్టీలూ మద్దతునివ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినా, అందుకు సంబంధించిన లేఖలు ఇవ్వకపోవడంతో సేన ఆశలు ఆవిరయ్యాయి. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్‌తోనూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మద్దతునివ్వాలంటే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలంటూ ఎన్‌సీపీ పెట్టిన షరతును కూడా శివసేన అంగీకరించింది. కేంద్ర కేబినెట్‌లో శివసేన ఏకైక మంత్రిగా ఉన్న అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. బీజేపీ పట్ల తనకు ఎలాంటి విశ్వాసం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కేబినెట్‌లో కొనసాగలేనని అరవింద్ సావంత్ ఢిల్లీలో ప్రకటించారు. శివసేనతో కుదుర్చుకున్న ఒప్పందం విషయంలో బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరి కొంత గడువు ఇవ్వాలని మిత్రపక్షాలతో సంప్రదింపులు కొలిక్కి రాలేదని శివసేన చేసిన అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. కేంద్ర కేబినెట్ నుంచి సావంత్ తప్పుకోవడంతో బీజేపీ-శివసేనల మధ్య ఇక తెగతెంపులే అనే పరిస్థితి తలెత్తింది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కోషియార్ నుంచి తమకు ఆహ్వానం అందిందన్న విషయాన్ని ధృవీకరించిన ఎన్‌సీపీ నాయకత్వం తదుపరి ప్రయత్నాలపై దృష్టి పెట్టింది.

*చిత్రాలు.. ప్రభుత్వం ఏర్పాటుకు మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియార్‌ను కలిసిన శివసేన నాయకులు
* కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు లేఖను చూపుతున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ (ఇన్‌సెట్‌లో)