జాతీయ వార్తలు

అత్యుత్తమ పౌరులుగా నిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రకృతిని, సంస్కృతిని, మాతృభూమిని, మాతృభాషను ఎప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు అయిన చిన్నారులు భారతీయ సంస్కృతి, విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకుని అత్యత్తమ పౌరులుగా నిలవాలని సూచించారు. ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి.. జాతీయ బాలలు దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ పటేల్ హాల్‌లో హరియాణాలోని బులంద్‌షహర్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఢిల్లీలోని పలు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్న కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. విద్య ద్వారానే చిన్నారుల్లో వికాసానికి బాటలు పడతాయని జవహార్‌లాల్ నెహ్రూ భావించారని, అందుకే భవిష్యత్ భారతాన్ని దృష్టిలో ఉంచుకోని పలు ప్రఖ్యాత విద్యా సంస్థలను ప్రారంభించారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులపై దృష్టిపెట్టడంతోపాటుగా స్వచ్చ భారత్, ఫిట్ ఇండియా వంటి సామాజిక కార్యక్రమాలకు అంబాసిడర్లుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే విషయంలోనూ చిన్నారులు తమ చుట్టూ వున్న సమాజాన్ని జాగృతపరిచే భాధ్యతను తీసుకోవాలన్నారు. మాతృభాషను ప్రేమించాలని, ఇంట్లో చుట్టుపక్కల వారితో తల్లిభాషలో మాట్లాడాలని సూచించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని.. కేంద్రం రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదాతోపాటుగా యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని అన్నారు. ప్రముఖల జయంతుల సందర్భంగా వారికి నివాళులు అర్పించడం.. దేశానికి వారు చేసిన సేవలను, చూపిన విలువలు, ఆదర్శాలను గుర్తు చేసుకుని వాటిని పాటించడమేనని ఆయన పేర్కొన్నారు.

*చిత్రం... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు