జాతీయ వార్తలు

తెలంగాణలో నిధుల పక్కదారి: ఎంపీ సంజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వ దారి మళ్లిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ అవరణలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం కేటాయించిన నిధులను ఆ కార్యక్రమం కోసమే వినియోగించాల్సి ఉంటుందని అన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వం వల్ల 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తెలంగాణలో శాంతియుతంగా నిరసన తెలిపే అవకావం కూడా లేకుండా పోయిందని సంజయ్ అన్నారు.