జాతీయ వార్తలు

కాలుష్య నివారణకు పరిష్కారం చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య సమస్యను నివారించడానికి అవసరమైన పరిష్కార మార్గాలను కనుకొనాలని దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీసహా దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నదని, మనిషి మనుగడనే ప్రశ్నార్థంగా మార్చే ప్రమాదం పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి భవన్‌లో మంగళవారం, దేశంలోని 23 ఐఐటీలు, 31 నిట్‌లతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ)కి చెందిన డైరెక్టర్లు హాజరైన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాబోయే భయానకమైన పరిస్థితులకు ఇది సంకేతమని ఎంతో మంది శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే దట్టమైన పొగమంచు వ్యాపించి, ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంటుందో అప్పుడు వాయు కాలుష్యం తీవ్రాతితీవ్రంగా ఉందని ఉందని తెలుసుకోవాలని రాష్ట్రపతి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీతోపాటు అనేక నగరాలు, పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. దీని తీవ్రతను గుర్తించి, పరిష్కార మార్గాలను కనుకొనాల్సిన బాధ్యత ఐఐటీలు, నిట్‌లోని ఇంజనీర్లు, శాస్తవ్రేత్తలపై ఉందన్నారు. ఈ విద్యా సంస్థలకు చెందిన ప్రతి ఒక్కరిపై తనకు ఎంతో నమ్మకం ఉందని, కాబట్టి, కాలుష్య నివారణకు వారు మార్గాలను కనుగొంటారనే అనుకుంటున్నానని కోవింద్ చెప్పారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీసహా అనేక ప్రాంతాల్లో కాలుష్య సమస్య పెరుగుతున్నదని ఆయన అన్నారు. అదే విధంగా ఇటుక బట్టీల కారణంగా కూడా వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నదని ఆయన అన్నారు. ఇది ఏ ఒక్క నగరానికో, ప్రాంతానికో, దేశానికో చెందిన సమస్య కాదని అన్నారు. యవాత్ మానవాళిని కాలుష్య భూతం కబళించకముందే నివారణ మార్గాలను అనే్వషించి అమలు పరచాలని ఆయన కోరారు.
*చిత్రం... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్