జాతీయ వార్తలు

కర్నూలు నుంచి ఇస్తెమాకు ప్రత్యేక రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: ఈ నెల 21న మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో నిర్వహించే ఇస్తెమాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఇస్తెమా కార్యక్రమానికి కర్నూలు నుంచి పెద్దఎత్తున ముస్లింలు వెళ్తారని.. ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని లోక్‌సభ సభ్యుడు డా.సంజీవ్‌కుమార్ రైల్వే బోర్డు చైర్మన్, ఇతర ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ ప్రత్యేక రైలు (నెం.7423) ఈ నెల 21న మధ్యాహ్నం 12.40కి కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 22వ తేదీ ఉదయం 10.50 నిమిషాలకు భోపాల్ చేరుకోనుంది. అలాగే ఇస్తెమా ముగిసిన తర్వాత ప్రత్యేక రైలు (నెం.7424) ఈ నెల 25 రాత్రి 11 గంటలకు భోపాల్‌లో బయలుదేరి 26 రాత్రి 11.30 నిమిషాలకు కర్నూలు చేరుతుంది.