జాతీయ వార్తలు

కేజ్రీవాల్ సభకు ముందే ఆప్ ఎమ్మెల్యే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్ (గుజరాత్), అక్టోబర్ 16: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ గుజరాత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాబ్ సింగ్ యాదవ్‌ను ఆదివారం ఇక్కడ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గులాబ్ సింగ్ అనుచరులు బెదిరించి డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై నమోదయిన కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అంతకుముందే ఎమెల్యే స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. తరువాత అక్కడే ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్న బహిరంగ సభ మరికొన్ని గంటల్లో జరుగనున్న తరుణంలో ఆ కార్యక్రమం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయడం విశేషం. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. తన సూరత్ ర్యాలీని భగ్నం చేయాలనే కుట్రలో భాగంగానే తమ పార్టీకి చెందిన మటియాలా ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ఆరోపించారు. తన సూరత్ ర్యాలీని భగ్నం చేయడానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ‘్ఢల్లీ పోలీసులు గులాబ్ సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా జారీ అయిన నాన్ బెయిలబుల్ వారంటుతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముందే ఉమ్రా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. మేము అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించాం’ అని సూరత్ పోలీసు కమిషనర్ సతీశ్ శర్మ చెప్పారు. ఉమ్రా పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ముందు ఎమ్మెల్యే యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ ‘నేను సెప్టెంబర్ 6నుంచి గుజరాత్‌లోనే ఉన్నాను. పోలీసులు ఢిల్లీలోని నా కార్యాలయంపై దాడి చేశారు. నేను నేరం చేసినట్టు నిరూపించే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ మేము కేంద్రానికి తలవంచే సమస్యే లేదు. ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కొంటాం’ అని అన్నారు. కేజ్రీవాల్ సూరత్‌కు బయల్దేరడానికి ముందు వడోదరలో విలేఖరులతో మాట్లాడుతూ సూరత్ ర్యాలీకి అడ్డంకులు సృష్టించడానికే యాదవ్‌ను అరెస్టు చేశారని, ఇందులో అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు.

చిత్రం.. సూరత్‌లో ‘ఆప్’ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతున్న అరవింద్ కేజ్రీవాల్