జాతీయ వార్తలు

ప్రాజెక్టులే అభివృద్ధికి పట్టుగొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇవ్వటంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ పథకం వలన నీటిపారుదల రంగంలో వౌలిక సదుపాయాలు ఏర్పడతాయని ప్రశంసించారు. అరుణ్ జైట్లీ సోమవారం కేంద్ర జలవనరుల శాఖ విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన జల వారోత్సవాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పట్టుదలతో పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి రెండు నదులను అనుసంధానించారని ప్రశంసించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయితే రాయలసీమలోని అనంతపురం తదితర కరువు పీడిత జిల్లాలకు నీటిని అందజేయవచ్చునన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ తదితర మంచినీటి, సాగునీటి పథకాలు ఎంతో బాగున్నాయని జైట్లీ మెచ్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో కరవు, అకాల వర్షాల వంటి ప్రతికూల పరిస్థితులున్నా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 22 శాతం కంటే ఎక్కువ ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
నీటిపారుదల రంగంలో వౌలిక సదుపాయాలను పెంచటం వల్లే ఇది సాధ్యమైందని జైట్లీ అన్నారు. తెలంగాణ కూడా ఇప్పుడు ఈ లక్ష్య సాధనకోసమే కృషిచేస్తోంది, నీటిపారుదల రంగంలో వౌలిక సదుపాయాలను పెంచేందుకు కృషి చేస్తోందని జైట్లీ ప్రశంసించారు. నీటిపారుదల, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని జైట్లీ హామీ ఇచ్చారు. నీటి పారుదల రంగంపై పెట్టుబడులు పెట్టే రాష్ట్రాలకు నాబార్డుతోపాటు, ఇతర విభాగాలద్వారా పూర్తిస్థాయిలో నిధులు సమకూరుస్తామని ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రి నీటి పారుదల పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వ్యవసాయాభివృద్ధి ఎంతో ముఖ్యం, వ్యవసాయ రంగం అభివృద్ధికి నీటిపారుదల రంగం తాళం చెవిలాంటిదని జైట్లీ తెలిపారు. నీటిపారుదల రంగంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని ఆయన చెప్పారు.
విద్యాసాగర్ రావు హితవు
ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి ప్రజలకు అందించేందుకు జల వారోత్సవం లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. జల వారోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి ప్రాధాన్యతను తెలియజేసేవిధంగా ఈ అంశాలను పాఠ్యాంశాలుగా పొందుపరిచే అంశంపై జల వారోత్సవాల్లో చర్చించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయటంతోపాటు త్వరగా పూర్తయ్యే మధ్య చిన్నతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు విద్యాసాగర్‌రావు వెల్లడించారు.

చిత్రం సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన జల వారోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి ఉమా భారతి.