జాతీయ వార్తలు

ఫిబ్రవరి నాటికి కల్యాణి ఎయిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్యాణి, డిసెంబర్ 4: పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్ క్యాంపస్‌లో వచ్చే ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కల్యాణిలో ఎయిమ్స్ అవుట్ పేషెంట్ విభాగం నిర్మాణంలో ఉంది. కల్యాణి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకృష్ణ బుధవారం ఇక్కడ మాట్లాడుతూ సెప్టెంబర్ 4 నుంచి తరగతులు ప్రారంభించినట్టు వెల్లడించారు. జేఎన్‌ఎం ఆసుపత్రిలో తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాజధాని కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో జేఎన్‌ఎం ఉంది. వచ్చే ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించేందుకు క్యాంపస్‌లో వౌలిక సదుపాయలు కల్పిస్తున్నట్టు శ్రీకృష్ణ చెప్పారు. క్యాంపస్‌లోనే విద్యార్థులకు వసతి గృహం ఉంటుందని అన్నారు. కల్యాణి క్యాంపస్‌లోన ఐదు అంతస్తుల భవనంలో విద్యార్థులు, విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. క్యాంపస్‌లోని మిగతా భవనాల నిర్మాణం పూర్తికావచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియోలజీ, కమ్యూనిటీ, హెల్త్ మెడిసిన్ తరగతులు ప్రస్తుతం బోధిస్తున్నట్టు డీడీ పేర్కొన్నారు. ప్రస్తుతం 19 ఫ్యాకల్టీ సభ్యులున్నారని, త్వరలోనే మరో నలుగురు వస్తున్నారని ఆయన తెలిపారు. నవంబర్ 7న ఢిల్లీలో కల్యాణి ఎయిమ్స్ మొదటి బోర్డు సమావేశం జరిగిందని ఆయన వివరించారు. వెల్లూరు సీఎంసీ, పుదుచ్ఛేరి జిప్‌మెర్ ఫ్యాకల్టీల సహకారంతో పాఠ్యాంశాలు రూపొందిస్తున్నట్టు శ్రీకృష్ణ వెల్లడించారు. కల్యాణిలో 180 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిమ్స్ క్యాంపస్ రూపొందిస్తున్నారు. వైద్య సేవలు పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు అందుతాయి.