జాతీయ వార్తలు

ఐదేళ్లలో 14,500 ఎన్జీవోలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, డిసెంబర్ 4: గత ఐదేళ్లలో విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం కింద నమోదైన 14వేల 500పైగా స్వచ్ఛంద సంస్థలపై నిషేధం విధించినట్లు రాజ్యసభ బుధవారం స్పష్టం చేసింది. ‘కేవలం ఈ సంవత్సరం ఈ చట్టం కింద 1808 స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జీవో) రిజిస్ట్రేషన్లను రద్దు చేశాం.. గత ఐదేళ్లలో 14వేల 550 సంస్థలపై నిషేధం విధించాం’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ఆదాయ పన్ను దాఖలు చేయని కారణంగా 1808 సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని రాజ్యసభకు మంత్రికి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి స్పష్టం చేశారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల మేరకు ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ కచ్చితంగా ఏటా వార్షిక ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు సైతం దీనికి సంబంధించి ఆన్‌లైన్ యంత్రాంగం ద్వారా నోటీసులు పంపించామని రాజ్యసభకు వివరించారు. వారి రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసే అంశాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. వీరిపై కఠిన చర్యలు సైతం తీసుకొంటామని వెల్లడించారు. విదేశాల నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ కింద ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకు భారత్‌కు 2,244.77 కోట్ల నిధులు వచ్చాయనీ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 16వేల 902 కోట్లు వచ్చాయని మంత్రి రాజ్యసభకు తెలియజేశారు.

*చిత్రం... కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్