జాతీయ వార్తలు

ఈ కమిషన్ ధోరణే ఇంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా మత స్వేచ్ఛ పర్యవేక్షణ కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం మంగళవారం తీవ్ర పదజాలంతో ఖండించింది. అసలు ఈ అంశంపై ఈ కమిషన్‌కు ఏరకమైన సంబంధం లేదని, దురుద్దేశాలు, వైషమ్యాల ప్రాతిపదికగానే పౌరసత్వ బిల్లుపై వ్యాఖ్యానించిందని భారత్ తెలిపింది. ఈ కమిషన్ వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గతంలో ఈ కమిషన్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ తాజా ప్రకటన ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని, ఇది వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు లక్ష్యాల గురించి ఈ కమిషన్‌కు ఏమాత్రం అవగాహన
లేదని, తనకేమాత్రం సంబంధం లేని అంశంపై జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిందని రవీష్ కుమార్ అన్నారు. అమెరికా సహా ప్రతి దేశానికీ తమ పౌరులకు సంబంధించి అవసరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎంతైనా ఉంటుందని, ఈ రకమైన చర్యలు ఆయా దేశాల స్వయం నిర్ణయాధికారాలని రవీష్ కుమార్ తెలిపారు. దీనిపై అమెరికా కమిషన్ చేసిన వ్యాఖ్యలు ‘ఎంతమాత్రం వాస్తవాలకు అద్దం పట్టడం లేదు. అంతేకాదు, అనవసరమైనవి కూడా’ అని అన్నారు. బంగ్లా, పాక్, అఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని, భారత్ వచ్చిన వారికి పౌరసత్వ కల్పనకు ఈ సవరణ బిల్లు వీలుకల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ రకంగా భారత్‌లోకి వచ్చిన శరణార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులను, వారికి కల్పించాల్సిన కనీస హక్కులను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని రవీష్ కుమార్ వివరించారు. నిజంగా మత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నవారైతే ఈ బిల్లును ఎంతమాత్రం విమర్శించకూడదని అన్నారు. భారత్ ఈ బిల్లును తెచ్చినప్పటికీ తమ దేశంలో పౌరసత్వాన్ని పొందేందుకు ఇతర మతస్థుల ప్రయత్నాలకు ఏమాత్రం అవరోధం కలిగించడం లేదని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో భారత్ పౌరసత్వం పొందినవారి జాబితాను పరిశీలిస్తే వాస్తవం అర్థమవుతోందని అన్నారు.