జాతీయ వార్తలు

రిజర్వేషన్లపై రాజకీయం చేసింది ఆర్‌ఎస్‌ఎస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఖండించారు. ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఇతర బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై అనుమానాలను ఎవరు రేకెత్తించారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రిజర్వేషన్ల ఆంశాన్ని రాజకీయం చేయలేదన్నారు.
వాస్తవానికి బిజెపి అనుబంధ సంస్థలు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ అంశాన్ని వివాదాస్పదం చేశాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల అంశాన్ని పలు మార్లు ప్రస్తావించారు కాబట్టి నరేంద్ర మోదీ తన విమర్శలు ఆయనపై ప్రయోగించాలని మనీష్ తివారీ సూచించారు. బిజెపి తాజాగా మరోసారి జాతీయవాదంపై తప్పుడు చర్చను లేవదీసిందని ఆయన విమర్శించారు. భారత్ మాతా కీ జై అనే వారు మాత్రమే నిజమైన జాతీయవాదులని బిజెపి వాదించటం మంచిది కాదన్నారు.