జాతీయ వార్తలు

సుప్రీంలో సవాల్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రగులుకుంటున్న నేపథ్యంలో ఈ వివాదాస్పద బిల్లును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు బీజేపీ ఆమోదముద్ర వేయించుకోగలిగినప్పటికీ ఇటు రాజకీయంగాను, అటు పౌర సమాజంలోనూ దీనిపై వ్యతిరేకత నానాటికీ తీవ్రమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావాలని ప్రయత్నించినా పార్లమెంటులో ఆమోదం పొందినా కూడా అది న్యాయ పరీక్షలో నెగ్గే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు గురువారం ప్రకటించారు.