జాతీయ వార్తలు

కలిసొచ్చిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: నిజమో..యాధృచ్ఛికమోగానీ పేరు మార్పు అన్నది చాలామందికి అనేక విధాలుగా కలసి వస్తుందన్నది వాస్తవం. ముఖ్యంగా అదృష్ట రేఖల మాట ఎలావున్నా సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరులో మార్పు చేస్తే మాత్రం రాజకీయ నాయకులకు కలసి వస్తుందన్నది వర్తమాన సత్యం. కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన పేరులో స్వల్ప మార్పు చేసుకున్నప్పటి నుంచి ఆయన జాతకం తిరిగింది. గతంలో యడ్డీయూరప్ప అన్న తన పేరును యడియూరప్పగా మార్చుకున్నప్పటి నుంచి అదృష్టం కూడా ఆయనను అన్నివిధాలుగా వరించింది. కర్నాటక నాలుగో ముఖ్యమంత్రిగా జూలైలో పదవీ స్వీకార ప్రమాణానికి ముందు ఆయన తన పేరును మార్చుకున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారమే పేరులో ఈ మార్పు చేసుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఎప్పుడైతే పేరులో మార్పు జరిగిందో అసెంబ్లీలో బలపరీక్షను సునాయాసంగా గెలిచారు. తాజాగా, 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 సీట్లను కైవసం చేసుకుని, అసెంబ్లీలో బలమైన మెజారిటీ సంపాదించారు. గతంలో కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితతోపాటు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పేర్లలో స్వల్ప మార్పు చేసుకున్నవారికి అన్నివిధాలుగా కూడా కలసివచ్చింది. అయితే, యడియూరప్ప తాజా విజయాలకు ఆయన తన పేరును మార్చుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ‘ఇది యాధృచ్ఛికమూ కావచ్చు. లేదా రాజకీయంగా ఆయనకు అదృష్టం కలిసి రావచ్చు’ అని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎందుకంటే పేరు మార్చుకున్నా కూడా ఉప ఎన్నికల్లో విజయం సాధించే వరకు కూడా ఆయన ప్రభుత్వ పరిస్థితి డోలాయమాన చందంగానే కొనసాగిందని ఆ నేత అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర సారథ్యాన్ని చేపట్టారే గానీ కర్నాటకలో భారీ ఎత్తున ప్రకృతి వైపరీత్యం సంభవించిందని, దానివల్ల ప్రాణ నష్టంతోపాటు ఆస్తినష్టమూ భారీగానే జరిగిందని ఆయన తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా అనుకున్న స్థాయిలో రాష్ట్రానికి వరద సహాయాన్ని ఆయన తెచ్చుకోలేకపోయారని, ఈ వైఫల్యంపై ఇటు విపక్షాలు, అటు మీడియా కూడా ఆయనపై దుమ్మెత్తిపోసిన విషయాన్ని కూడా ఆ నేత గుర్తు చేశారు. వ్యక్తిగతంగా బీజేపీ శ్రేణుల్లో కేంద్ర స్థాయిలో మంచి పలుకుబడి ఉన్నప్పటికి కూడా మంత్రివర్గ ఏర్పాటులో ఆయన తన మాటను నెగ్గించుకోలేకపోయారని, బలవంతంగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకోవాల్సి వచ్చిందని ఆ నాయకుడు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడ్డ దాదాపు 20 రోజులపాటు ఒకే సభ్యుడితో కేబినెట్ నడపాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడిందని అన్నారు. యడియూరప్ప తన పేరును మార్చుకున్న విషయం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తూ జూలై 26న గవర్నర్ వజూభాయ్ వాలాకు రాసిన లేఖతోనే వెల్లడైంది.
తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అధికారిక ఆహ్వానంలో కూడా ఈ మారిన పేరే ముద్రితమైంది. 2007లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రస్తుతం ఉన్న పేరే ఆయనకు ఉండేది. దానిని యడ్డియూరప్పగా మార్చుకున్నారు. దాంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే జేడీఎస్ నుంచి తలెత్తిన సమస్య కారణంగా రాజీనామా చేశారు. అలా పేరు మార్పు ప్రభావం కొనే్నళ్లపాటు కొనసాగింది. ఎలాంటి అదృష్టమూ ఆయనను వరించలేదు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా అర్ధంతరంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తమిళనాడులో కూడా పేరు మార్పు వల్ల జాతకాలు మారుతాయన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో చాలా బలంగానే కనిపిస్తోంది. ఈ నమ్మకంతోనే కొందరు తమ పేర్లను కుదించుకోవడం లేదా విస్తరించుకోవడం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన ఆంగ్ల పేరులో ‘ఏ’ అన్న పదాన్ని అదనంగా చేరుకున్నారని, అందుకు కారణం సంఖ్యా శాస్త్రం, ఆధ్యాత్మికత పట్ల ఆమెకున్న నమ్మకమేనని రాజకీయ విశే్లషకుడు తరసూ శ్యామ్ అన్నారు. అలాగే, ఎండీఎంకే నాయకుడు వీ గోపాల స్వామి కూడా తన పేరును వైగోగా మార్చుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ (తిరుచురాపల్లి) తిరునవుక్కరసార్ ముందు పేరు తిరునావుక్కరసు. అయితే, ఇలా పేర్లు మార్చుకోవడం వెనుక ఎలాంటి కారణం లేదని వివరించారు.

*చిత్రం.... కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప