జాతీయ వార్తలు

ఐదు ఖాళీ రైళ్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 14: కేంద్రంలో ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనకారులు శనివారం సాయంత్రం ఐదు ఖాళీ రైళ్లను దగ్ధం చేశారు. ముర్షీదాబాద్ జిల్లాలోని లాల్‌గోలా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్టవ్య్రాప్తంగా రైలు, రోడ్డు సర్వీసులను దిగ్బంధనం చేశారు. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఈ ‘క్యాబ్’ వ్యతిరేక ఘటనలు తాజా ఘటనతో పశ్చిమ బెంగాల్‌లోనూ రగులుకున్నట్టు అయింది. శనివారం ఉదయం హౌరా ప్రాంతంలోని సంక్రాయిల్ రైల్వే స్టేషన్‌కు వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు ఒక భాగాన్ని దగ్ధం చేశారు. అలాగే, సమీపంలోని కొన్ని దుకాణాలకు నిప్పుపెట్టారు. అనంతరం రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి టికెట్ కౌంటర్‌ను తగులబెట్టారని రైల్వే రక్షణ దళం అధికారి ఒకరు తెలిపారు.
అనేకచోట్ల రైలు పట్టాలపైనే బైఠాయించి, రైళ్ల రాకపోకలకు అవరోధం కలిగించారు. శాంతియుతంగానే నిరసన ప్రదర్శన చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ అప్పీలు చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. ముఖ్యంగా తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన తీవ్రత పెరిగింది.
*చిత్రం... రైళ్లు రద్దు కావడంతో దిక్కుతోచని స్థితిలో గౌహతిలో రైలు ప్రయాణికులు