జాతీయ వార్తలు

‘పౌరసత్వ’ మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, హింస, విధ్వంసకాండలతో దేశ రాజధాని ఢిల్లీ దద్ధరిల్లింది. ఆందోళనకారులు మూడు బస్సులను దగ్దం చేశారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య జామియా యూనివర్సిటీ సమీపంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసులు, ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది గాయపడ్డారు. తాము శాంతియుతంగానే నిరసన తెలిపామని, హింసాకాండతో తమకు ఎలాంటి సంబంధం లేదని విద్యార్థి సంఘం వెల్లడించింది. కొందరు వ్యక్తులు ఈ నిరసన కార్యక్రమంలో చేరి ఈ అరాచకానికి పాల్పడినట్లు వెల్లడించింది. తమ అనుమతి లేకుండానే పోలీసులు యూనివర్సిటీలోకి ప్రవేశించారని సిబ్బందిని, విద్యార్థులను తరిమి కొట్టారని జామియా యూనివర్సిటీ చీఫ్ ప్రాక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. పోలీసు చర్యను వైస్-్ఛన్సలర్ నజ్మా అక్తర్ ఖండించారు. పరిస్థితిని అదుపు చేసేందుకే తాము యూనివర్సిటీలోకి ప్రవేశించామని, అప్పటికే హింసాకాండ తీవ్రమైందని డిప్యూటీ పోలీసు కమిషనర్ చిన్మయి బిస్వాల్ తెలిపారు.
ఆందోళనకారులు నాలుగు బస్సులను దగ్దం చేశారని, మరో రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారని చెప్పారు. తమపై విద్యార్థులు రాళ్ళు విసరడం వల్లే యూనివర్సిటీలోకి ప్రవేశించి బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పారు. కాగా, ఈ అల్లర్లకు సంబంధించి అనేక మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మోటార్ సైకిల్ నుంచి పెట్రోలు తీసి, దానితోనే ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలను హుటాహుటిన రప్పించారు. అప్పటికే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. దేశంలోని ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పించాలన్న కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు దేశ రాజధానిని అట్టుడుకిస్తున్నాయి. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సోమవారం స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. ఈ హింసాకాండ వ్యవహారం అధికార ఆమ్ అద్మీ పార్టీ, బీజేపీల మధ్య వాగ్యుద్దానికి దారి తీసింది. ఈ అల్లర్లను అధికార పార్టీయే ప్రోత్సహిస్తున్నదని బీజేపీ చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నది ‘ఆప్’ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ హింస, అల్లర్ల వెనుక ఆప్ హస్తం ఉందని బీజేపీ నాయకుడు మనోజ్ తివారీ ఆరోపించడంతో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ద్రోహిగా పేర్కొన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.
ఇదిలాఉండగా ఈశాన్య భారతంతో పాటు అనేక రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు మరింత రాజుకున్నాయి. అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో నివురుగప్పిన నిప్పులాంటి పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ రెండో రోజు కూడా వ్యతిరేక ప్రదర్శనలతో అట్టుడుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో ఆందోళన కారణంగా జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
దీనికి కర్ఫ్యూ కూడా తోడు కావడంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అనేక చోట్ల పరిస్థితులు రోజు, రోజుకూ తీవ్రంగా కావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆందోళనలు తీవ్రం కావడంతో అన్ని చర్యలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తాజాగా రాష్ట్రంలోని మరి కొన్ని జిల్లాలకు పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు వ్యాపించడంతో ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపి వేశారు. బెంగళూరుతో పాటు అనేక పట్టణాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

*చిత్రం... ఢిల్లీలో ఆదివారం ఆందోళనకారుల విధ్వంసంలో దగ్ధవౌతున్న బస్సు