జాతీయ వార్తలు

అల్లర్లు రాజేస్తున్నది విపక్షాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధుమ్‌కా (జార్ఖండ్), డిసెంబర్ 15: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఓ ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అశాంతికి, దహన విధ్వంసకాండలకు ఆజ్యం పోస్తున్నాయని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే విధ్వంస, దహనకాండలకు పాల్పడుతున్నారో వారి బట్టలను బట్టి చూస్తే వారెవరో స్పష్టమవుతుందని ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్యం భారతంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోనూ తలెత్తుతున్న హింసాత్మక నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతునిస్తున్నాయని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంతగా వ్యతిరేక ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేసినా, ఈశాన్య భారత ప్రజలు దానిని తిరస్కరించారని మోదీ తెలిపారు. కాంగ్రెస్ చేపడుతున్న చర్యలను బట్టి చూస్తే పార్లమెంట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవేనన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. విదేశాల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలనూ మోదీ ఖండించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏ పనైతే చేస్తూ వచ్చిందో ఆ పనిని తొలిసారిగా కాంగ్రెస్ చేసిందని అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా లండన్‌లోని భారత హఐ కమిషన్ ఎదుట పెద్ద సంఖ్యలో జరిగిన నిరసనలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. రామజన్మభూమి అలాగే 370 అధికరణ రద్దు నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా లండన్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్నది అక్కడ స్థిరపడ్డ పాకిస్తానీయులేనని మోదీ అన్నారు. ఒక్క భారతీయుడు కూడా ఈ రకమైన నిరసనలకు పాల్పడలేదని, ఏదైనా సమస్య ఉంకే యంబసీ అధికారులను కలిసి పరిష్కరించుకుంటారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విదేశాల్లో భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోందని మోదీ అన్నారు. పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ వెయ్యి శాతం సమంజసమేనన్న విషయం విపక్షాల ఆందోళనలతో మరింతగా స్పష్టమవుతోందన్నారు. గత ఐదేళ్లుగా జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సాధించిన విజయాలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతి పక్షాలు భవనాలు కట్టుకున్నాయే తప్ప, ప్రజలకు ఎలాటం మేలు చేయలేదని మోదీ తెలిపారు. అలాగే ప్రస్తుతం కలిసి పోటీ చేస్తున్న జార్ఞండ్, జెఎంఎంలకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అజెండా కూడా లేదని వమర్శించారు. దేశం కోసం గిరిజన సమరయోధులు చేసిన త్యాగాలను ప్రస్తావించిన మోదీ ‘బిర్సా ముండా, సీడోకానో, చాంద్-్భరవ్, పూలో-జానోలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుబడి ఉంటే బ్రిటీష్ పాలకులు భారత్‌ను వదిలి వెళ్లి ఉండేవారా’అని మోదీ ప్రశ్నించారు.
ఈ గిరిజన త్యాగ ధనులు వ్యక్తిగత ప్రయోజనాలను, ప్రాణాలను పణంగా ఫెట్టి దేశం కోసం పాటుబడ్డారని మోదీ అన్నారు. బీజేపీ తన సంస్కృతిని వీరి నుంచే పుణికి పుచ్చుకుందని మోదీ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో స్థానిక భాషలను ఉపయోగించాలంటూ ఎంపీలను, ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు మోదీ కృత్ఞృతలు తెలిపారు.
*చిత్రం...జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఐదోదశ ప్రచారంలో భాగంగా ధుమ్‌కాలో ఆదివారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ