జాతీయ వార్తలు

చొరబాట్ల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: జమ్మూ, కాశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో పాకిస్తానీ ఉగ్రవాదులు పెద్దఎత్తున చొరబాటుకు విఫలయత్నం చేసిన ఫోటోలను బిఎస్‌ఎఫ్ శనివారం విడుదల చేసింది. రాత్రిపూట ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన ఈ థర్మల్ ఇమేజెస్‌లో పాక్ రేంజర్ల తోడ్పాటుతో ఉగ్రవాదులు మన భూభాగంలోకి చొరబడడానికి పెద్దఎత్తున కాల్పులు, బాంబుదాడులకు తెగబడ్డం, బిఎస్‌ఎఫ్ దళాలు ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిన దృశ్యాలున్నాయి. బిఎస్‌ఎఫ్ స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ, బాంబులు విసురుతున్న దృశ్యాలు ఈ ఫుటేజిలో ఉన్నాయి. బుధవారం రాత్రి ఆరుగురు ఉగ్రవాదులు పాక్ వైపున చీకటిగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నించారని బిఎస్‌ఎఫ్ అధికారులు చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపానికి చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ ఉన్న బిఎస్‌ఎఫ్ పోస్టుపైకి ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరపడమే కాకుండా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో దాడులు చేశారని వారు తెలిపారు. బిఎస్‌ఎఫ్ జవాన్లు సమర్థవంతంగా ఈ దాడులను తిప్పికొట్టడంతో ఉగ్రవాదులు తిరిగి పాక్ వైపునకు పలాయనం చిత్తగించారని అధికారులు చెప్పారు. రాత్రి 11.45 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని, 20 నిమిషాలపాటు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి అక్కడున్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపినప్పటినుంచి పాకిస్తాన్ ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.