జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రైతుల ‘మూగ’ వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్ పుర, అక్టోబర్ 22: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కరుల దాడులు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫిరంగులు, తుపాకీ బుల్లెట్లకు పశు సంపదనను కోల్పోతున్నారు. పశుపోషణే జీవనాధారంగా బతుకున్న రైతులు ‘మూగ’ రోదనను వినిపించుకునేవారై కరవైపోయారు. ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో గత రాత్రి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పులకు అభంశుభం ఎరుగని మూగజీవాలు బలైపోయాయి. ‘అందరి దృష్టిలో అవి పశువులే. మాకుమాత్రం అవి సంపాదించే కొడుకులతో సమానం. వాటి పాలు అమ్ముకుని బతుకున్న మాకు ఈ సంఘటన తీరని వ్యధే. ఉన్న ఒక్క జీవనాధారాన్ని కోల్పోయాం’ అని అరవై ఏళ్ల కిషన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ముష్కరులకు కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కాదు. ప్రతిసారీ ప్రాణనష్టం జరగకపోయినా ఆవులు, గేదెలను రైతులు కోల్పోతున్నారు. శుక్రవారం రాత్రి ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో కతువా సరిహద్దులో చొరబాట్లకు దిగిన పాక్ రేంజర్లను బిఎస్‌ఎఫ్ జవాన్లు ప్రతిఘటించి, తిప్పికొట్టారు. మన భద్రతాదళాల కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మృతి చెందాడు. అయితే బుధిపూర్ జతాన్, మరో గ్రామంపై పాక్ దళాలు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ప్రాణనష్టం అయితే లేదు గానీ, నాలుగు మూగజీవాలు మృతిచెందాయి. కాల్పుల్లో మరో రెండింటికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రాన్‌దీప్ సింగ్ వెల్లడించారు. ప్రజలెరకూ పగటిపూట ఇళ్లు వదలి రావద్దని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తుగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోగలుగుతున్నారే తప్ప పాపం, పుణ్యం తెలియని మూగ జీవాలను రక్షించలేకపోతున్నారు. ఒక్క కిషన్‌లాలే కాదు సరిహద్దుల్లోని రైతుల పరిస్థితి ఇలానే అత్యంత దయనీయంగా ఉంది. పంటల నుంచి దిగుబడి ఏడాదికి ఒకరి రెండుసార్లే. అయితే పశు సంపద అలాకాదు.. పాల ఉత్పత్తులతో ప్రతినెలా ఆదాయం వస్తుందని లాల్ చెప్పాడు. ‘కాల్పుల సమయంలో మేం అయితే బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటాం. పశువులు మాత్రం బలైపోతున్నాయి’ అని కుల్బీర్ సింగ్ అనే మరోరైతు వాపోయాడు.