జాతీయ వార్తలు

47మంది పోలీసులకు యావజ్జీవ ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్‌భిత్, ఏప్రిల్ 4: ఉత్తరప్రదేశ్‌లోలి పిల్‌భిత్‌లో 1991లో జరిగిన పది మంది సిక్కు యాత్రికుల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులుగా భావిస్తున్న 47 మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాదాపుపాతికేళ్ల క్రితం పిల్‌భిత్ జిల్లాలో ఒకే రాత్రి మూడు బూటకపుఎన్‌కౌంటర్లలో పది మంది సిక్కులను దారుణంగా హతమార్చిన ఈ కేసుపై 47 మంది పోలీసులు దోషులేనని శుక్రవారం నిర్ధారించిన కోర్టు వారి శిక్షలను సోమవారం ఖరారు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశం నేపథ్యంలో సిబిఐ ఈ విచారణ జరిపింది. మొత్తం 57 మంది పోలీసులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగిన సందర్భంలోనే 10 మంది పోలీసులు మరణించారు. శుక్రవారం 20 మంది పోలీసులు కోర్టుకు హాజరయ్యారు. వారిని జుడీషియల్ కస్టడీకి పంపడంతో పాటు మిగిలిన 27 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. ‘బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులో 47 మంది పోలీసులను దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి లల్లూ సింగ్ తీర్పును ఇచ్చారు. విచారణలో భాగంగా 67 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు’ అని సిబిఐ న్యాయవాది సతీశ్ జైస్వాల్ తెలిపారు. 1991లో ఉత్తరప్రదేశ్‌లోని తెరాయ్ ప్రాంతంలో తీవ్రవాదంతో అట్టుడికి పోయింది. అనేక నేర కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రికులుగా వచ్చే అవకాశం ఉందంటూ అప్పట్లో ఓ స్థానిక హిందీ పత్రిక రాసింది. ఆ కథనాన్ని అందిపుచ్చుకున్న పోలీసులు వివరాలు సేకరించి కొందరు మహిళలతో కలిసి కొందరు వ్యక్తుల బృందం బస్సులో ప్రయాణిస్తుందన్న విషయం తెలుసుకున్నారు. ఆ ఏడాది జూన్ 12న ఆ బస్సు పిల్‌భిత్ వెళ్తుండగా కచాలాపూల్ ఘాట్ వద్ద పోలీసులు దాన్ని ఆపి 11 మంది సిక్కులను పోలీసులు బయటకు ఈడ్చుకొచ్చారని సిబిఐ పేర్కొంది. మహిళలు, పిల్లలు సహా ఇతర యాత్రికులు పిల్‌భిత్‌లోని ఓ గురుద్వారాకు తీసుకెళ్లారు. పురుషులు వేరే బస్సులో కూర్చోబెట్టారని సిబిఐ తెలిపింది. అనంతరం ఈ సిక్కులను మూడు బృందాలుగా విభజించారని వెల్లడించింది. జూలై 12, 13 అర్థరాత్రి సమయంలో మొత్తం మూడు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వారిని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్లలో హతమార్చారని తెలిపింది. అయితే వారందరిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సిబిఐ వివరించింది. ఈ పది మంది మృతదేహాలపై అప్పటికప్పుడు పరీక్షలు జరిపించి అదే రోజు హడావుడిగా ఖననం చేసినట్టు సిబిఐ తన దర్యాప్తు నివేదికలో వెల్లడించింది.