జాతీయ వార్తలు

తప్పయితే ఉరి తీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ/ బెలగావి, నవంబర్ 13: పెద్ద నోట్లను రద్దు చేయడంపై చెలరేగుతున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇటు చిత్తశుద్ధి అటు ఆత్మ విశ్వాసం మేళవించిన ఉద్వేగ స్వరంతో తిప్పికొట్టారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే తనను బహిరంగంగా ఉరితీయాలని సవాలు విసిరారు. 5వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ రద్దు బాధాకరమే అయినా ఉజ్వల భవితవ్యానికి ఉద్దేశించిందేనని ఉద్ఘాటించారు. భారీ కుంభకోణాలకు పాల్పడ్డ నేతలు ఇప్పుడు నాలుగు వేల కోసం బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారంటూ విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. గోవాలోని పనాజీ, కర్నాటకలోని బెలగావీల్లో జరిగిన సభల్లో మాట్లాడిన మోదీ అవినీతి,నల్లధనం లేని భారత దేశాన్ని ఆవిష్కరించడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకూ సిద్ధమని చెప్పారు. ఎన్నో కష్టాలు చవిచూస్తున్నప్పటికీ సామాన్యుడి నుంచి పెద్ద నోట్ల రద్దుకు సానుకూల ప్రతిస్పందనే వస్తోందని, ఇది అనుకున్న ఫలితాల్ని ఇస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనమేమిటని మోదీ ప్రశ్నించారు.తనకు డిసెంబర్ 30వరకూ గడువివ్వాలని, అనంతరం అనుకున్న ఫలితాన్ని సాధించలేక పోతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటూ భావోద్వేగంతో అన్నారు. అవినీతికి తావులేని భారత దేశాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరూ డిసెంబర్ 30వరకూ ఓపిక పట్టాలని అభ్యర్థించారు. ఇప్పటి వరకూ సామాన్యులు ఏ రకమైన భారత దేశాన్ని కోరుకున్నారో..అది మరికొన్ని వారాల్లోనే సాకారం కావడం తథ్యమని ఉద్ఘాటించారు. అవినీతి మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు తనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయని చెప్పిన ప్రధాని ఇందుకోసం 50రోజులు ఆగాలని, కష్టాల్ని ఓర్చుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. తాము చేపట్టిన చర్య అవినీతిపై నిజాయితీ పరులు సంధించిన అస్తమ్రని పేర్కొన్నారు. ‘కొన్ని శక్తులు నాపై కక్ష గట్టాయని నాకు తెలుసు. 70ఏళ్లుగా దోచుకున్న మొత్తం కళ్ల ముందే కనుమరుగవుతోంది కాబట్టి.. వీరు నన్ను నన్ను బతకనివ్వరేమో.. నాశనం చేస్తారేమో..’నంటూ మోదీ ఉద్వేగంగా అన్నారు. ఎవరు ఎంతకు తెగించినా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాను సర్వసన్నద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘ఉన్నత పదవి కుర్చీలో కూర్చోడానికి నేను పుట్టలేదు.నా కుటుంబం, నా ఇల్లు సహా నాకున్నదంతా దేశం కోసం వదిలేశాను’అని మోదీ ఉద్వేగ స్వరంతో అన్నారు. అవినీతిని అంతం చేసేందుకే ప్రజలు తనకు అధికారం అప్పగించారని గుర్తు చేసిన మోదీ తాను చేపట్టిన చర్యలు అహంకారపూరితమైనవి కాదన్నారు. తాను పేదరికాన్ని చూశానని, ప్రజల సమస్యలేమిటో తనకు తెలుసునన్నారు. 500 నోటును 300లకు మార్చుకోవద్దని, తమ కష్టార్జితానికి పూర్తి విలువ పొందాలని ప్రజలను కోరారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతం కావడానికి మోదీ నిర్ణయమొక్కటే కారణం కాదని, కొన్ని లక్షల మంది దీన్ని వ్యతిరేకించినా..125కోట్ల మంది బలపరుస్తున్నారని ప్రధాని అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ వమ్ముకాకుండా..అదే సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా బ్యాంకర్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఒక ఏడాది కాలంలో ఎంత పని చేస్తారో..ఈ వారంలో అంతకు మించిన పనే చేశారని బ్యాంకర్లను మెచ్చుకున్నారు. బ్యాంకుల పనిభారాన్ని పంచుకునేందుకు పదవీ విరమణ చేసిన అధికారులు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని మోదీ తెలిపారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ